సరోజినీ నాయుడు | sarojini naidu details in telugu
సరోజినీ నాయుడు
Table of Contents
- బాల్యం
- చదువు
- వివాహము
- సమాజ సేవ
- మరణం
1.బాల్యం
సరోజినీ నాయుడి యొక్క తండ్రి డాక్టర్ అఘోరనాథ్ చటోపాధ్యాయ. తల్లి పేరు సుందరీదేవి.
ఆఘోరనాథ్ గొప్ప పండితుడు విద్యావేత్త. తూర్పు బెంగాలులోని బ్రహ్మగ్రామ నివాసి. గ్రామాన్ని వదిలి చదువుకోసం కోల్కతా చేరారు. అవిశ్రాంతంగా అనేక గ్రంథాలు చదివాడు. ఇంగ్లీషు, బెంగాలి, సంస్కృత భాషల్లో అసాధారణ పాండిత్యాన్ని సాధించారు .
వీరికి తొలి సంతానంగా సరోజిని 13-2-1879 న జన్మించింది.
ఎనిమిది మంది సంతానంలో సరోజిని తొలి బిడ్డ. చిన్నతనం నుండి అఘోరనాథ్ సరోజినికి సత్యంపైన బోధనలు చేయడం ద్వారా విశాల దృక్ఫాథాన్ని కలిగించాడు. దేశభక్తికి బీజాలు నాటాడు . ఆమె గొప్ప గణిత శాస్త్రజ్ఞురాలిగానో శాస్త్రవేత్తగానో ఎదగాలని కోరుకున్నారు. అందుకు తగిన శాస్త్రీయ ప్రణాళికను రూపోందించాడు. అయితే సరోజినిలోని కవితా శక్తి బలీయమై శాస్త్రవిజ్ఞానం పైని అభిరుచిని అణచివేసింది. కొండ నుండి దూకే జలపాతంలా ఆమె కవిత ప్రవహించింది.
మెట్రిక్యులేషన్ పరీక్ష పూర్తి చేసిన తరువాత సరోజిని ఆరోగ్యం దెబ్బతింది. 1892-95 కాలంలో ఇంటిలోనే గడిపారు. సాంఘిక, సాహిత్య సమాలోచనలకు కేంద్రమైన వారింటికి హైదరాబాద్ నగరంలోని ప్రముఖులు ఎందరో వచ్చేవారు. వారిలో డాక్టరు ముత్యాల గోవిందరాజులు | నాయుడుగారు ఒకరు. వారు నిజాం ఆస్థానవైద్యులు వృతిరీత్యా వైద్యులైనందున వారు కొన్ని సందర్భాలలో సరోజినిగారికి వైద్యం కూడ చేసేవారు. క్రమేణా డాక్టరుగారికి సరోజినిపై ఇష్టం ఏర్పడింది. ఆమెను వివాహం చేసుకోవాలని అభిలషించారు. అప్పటికి ఆమె వయసు 16 | సంవత్సరాలు. డాక్టరు సరోజిని కంటే పదిఏళ్ళు పెద్దవారు. తెలుగువారు. వివాహ అనంతరంవ ఆమె పేరు “సరోజిని నాయుడు” గా మారింది. వీరు హైదరాబాద్ లో నివాసం ఏర్పరచుకున్నారు. సంసార జీవితపు ఆనందాన్ని మాధ్యుర్యాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నారు. గృహిణిగా భర్తకు చేదోడు వాదోడయ్యారు. వారి వైవాహిక జీవితంలో నలుగురు పిల్లలకు, తల్లి అయ్యారు. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
1906లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం కలకత్తాలో జరిగింది. సరోజినీ నాయుడు ఆ సమావేశానికి హాజరై ఉద్రేకపూరితంగా ప్రసంగించింది. ప్రముఖ దేశ భక్తుడు. గోపాలకృష్ణ గోఖలే ఆ సమావేశానికి హాజరైనారు. వీరిని ప్రసంగం గోఖలేను అమితంగా ఆకర్షించింది. వీరిలో భావి భారతనేతను చూశారు. మాతృదేశ సేవ కోసం ఆమెను ఉత్సాహపరిచారు.
మహాత్మాగాంధీజితో సరోజిని నాయుడు తొలి పరిచయం 1914లో జరిగింది. దక్షిణాఫ్రికా నుండి భారత్కు వస్తూ లండన్లో దిగబోతున్న గాంధీజిని కలవవలసిందిగా గోపాలకృష్ణా గోఖలే ఆనాటికి లండన్లో ఉన్న సరోజినీ నాయుడుకు చెప్పారు. ఓడ దిగే సమయంలోనే గాంధీజీని కలవాలని అనుకుంది. కాని ఆ సమయానికి అక్కడికి వెళ్ళలేకపోయింది. ఆ మర్నాడు సాయంత్రం గాంధీజీని వెతుకుతూ బయలుదేరింది. లండన్ లో ఒక మారుమూల వీధిలో అందవిహీనమైన ఒక పాత భవంతిలో ఉన్నారు. గాంధీజీ. సరోజిని అక్కడకు వెళ్ళి గాంధీజీ ఉన్న గదికి చేరింది. ఆ గది తలుపులు తెరిచే ఉన్నాయి. బోడిగుండుతో నేలమీద కూర్చున్న గాంధీజీ ఆమెకు కన్పించారు.
సరోజినీ నాయుడు లండన్లో మహాత్ముని కలిసిన తరువాత 1914 చివరకు హైదరాబాద్ తిరిగి వచ్చింది. ఆ డిసెంబరులో గోఖలేకు ఉత్తరం రాస్తూ భారతదేశ జాడ్యం వదలాలంటే కొత్త మనుష్యులు కావాలని లక్ష్యాన్ని సాధించేందుకు మరింత కృతనిశ్చయులు కావాలని, మాటలలో నిర్భయత్వం చేతలలో దృఢత్వం చూపాలని దేశాన్ని ప్రేమించే జనం కావాలని, స్వార్థంతో జాతిని ఇంకా పతన దిశగా తోసే జనం ఉండరాదని, సంకుచిత భావాలలను ఈర్ష్య, అసూయాలను తాను ద్వేషిస్తున్నానని రాబోయే జాతీయ వారోత్సవాలు కొత్త ఉత్తేజాన్ని నింపాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపింది. మనసా, వాచా, కర్మణా
నెహ్రులో నీతి నిజాయితీలకు స్వాతంత్ర్వోచ్ఛకు ఈమె పరవశించింది. అతనిని తన సోరదునిగా ముఖ్య స్నేహితునిగా భావించింది. తన సహాయ సహకారాలను సంపూర్ణంగా అతనికి అందించింది.
1917లో కోల్కతాలో జరిగిన కాంగ్రెసు సమావేశానికి హాజరైన సరోజినీ నాయుడు కాంగ్రెస్, రాజకీయ నాయకులు వాణిని కాక, ప్రజావాణిని ప్రతిబింబించాలని, వ్యక్తిగత సమస్యలకు కాక ఆశయం, ఆరాటం అని చెప్పారు. 1918లో కంచిలో జరిగిన ప్రాంతీయ సమావేశానికి సరోజినీ నాయుడు అధ్యక్షత వహించటం స్వాతంత్య్ర సమరంలో పెరుగుతున్న ఆమె ప్రాధాన్యతకు నిదర్శనం.
1918 సెప్టెంబరులో ముంబైలో జరిగిన కాంగ్రెస్ ప్రత్యేక సమావేశానికి సరోజినీ నాయుడు హాజరై మహిళల ఓటు హక్కు తీర్మానం నెగ్గేందుకు ఎంతో కృషి చేశారు. 1919లో గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఈమె ఆయన వెంటనే ఉన్నారు. ముంబై, చెన్నై, ఆహమ్మదాబాద్లలో గాంధీతో పాటు ప్రచారం చేశారు. దేశీయులలో దేశభక్తిని ప్రజ్వలింపజేశారు. భారతీయుల హక్కులను అణగదొక్కే రౌలత్ చట్టాన్ని వ్యతిరేకించవలసిందిగా గ్రామీణ మహిళలను ప్రత్యేకంగా ప్రబోధించారు.
తన ప్రతిభాపాటవాలను నిరంతరం ప్రదర్శిస్తూ సరోజినిగారు జాతీయ నాయకులలో ఒకరయ్యారు. గాంధీజికి కుడి భుజంగా ఉంటూ తన నాయకత్వస్థాయిని పెంచుకుంటూ వెళ్ళగలిగారు. 1925 డిశంబరులో జరిగిన కాన్పూరు కాంగ్రెస్ మహాసభలకు అధ్యక్షస్థానాన్ని అలంకరించారు. జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని అలంకరించిన మొదటి మహిళ అనిబిసెంట్ కాగా, ఆ పదవిని స్వీకరించిన మొదటి భారత మహిళగా సరోజిని నాయుడు చరిత్రకెక్కారు. అధ్యక్షురాలిగా సుమధురం, ఉత్తేజపూరితమైన ప్రసంగాన్ని ఆమె క్లుప్తంగా వెలువరించి అందరి మన్ననలకు పాత్రులయ్యారు.
| ఆమె ప్రచారం అందరిని ఆకట్టుకుంది. ఉపన్యాసాలు సంచలనం కలిగించాయి. భారత ప్రతిష్టను పునఃప్రతిష్టను చేసి విజయవంతంగా తిరిగి వచ్చారు. 1929లో తూర్పు ఆఫ్రికాలో భారతీయ కాంగ్రెసు సమావేశాలను ప్రారంభించారు. సరోజని. ఆగ్నేయ ఆఫ్రికా అంతటా పర్యటించి ఉపన్యాసాలిచ్చారు. ఉప్పు సత్యాగ్రహం
రవి అస్తమించని బ్రిటీష్ మహా సామ్రాజ్య పాలకులపైన సాధరణమైన 'ఉప్పు'ను గాంధీజీ బ్రహ్మాస్త్రంగా ఉపయోగించారు. ఉప్పును ఎవరికివారే తయారు చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు 1930లో 'ఉప్పు సత్యాగ్రహాన్ని' నడిపారు. సబర్మతి | ఆశ్రయం నుండి 24 రోజుల పాటు కాలి నడకన 'దండి' గ్రామ వద్దకు గాంధీజీ చేరి ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించారు.
ఉప్పు సత్యాగ్రహంలో సరోజిని నాయుడును పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టారు. 1931 మార్చిలో కుదిరిన గాంధీజీ ఇర్విన్ ఒడంబడిక ప్రకారం ఈమె విడదల అయ్యింది.
అదే సంవత్సరం లండన్లో జరిగిన రెండవ రైండ్ టేబుల్ సమావేశానికి మహిళా ప్రతినిధిగా సరోజిని కూడా హాజరైనారు. 1933లో వ్యష్టి సత్యాగ్రహం సందర్భంగా సరోజినీ నాయుడును ప్రభుత్వం అరెస్టు చేసి ఒక సంవత్సరం పాటు జైలులో ఉంచారు. విడుదల అయిన తర్వాత ఈమె మహిళలు హక్కుల కోసం పోరాడారు. హిందూ ముస్లింల ఏకీకరణకు కృషి చేశారు. భారతదేశానికి హిందువులు, ముస్లింలు రెండు కళ్ళు వంటి వారని, ఆయిదు వర్గాల సరిగా పనిచేసి, మహాత్ముని అడుగు జాడలలో నడిచినపుడే దేశం స్వతంత్రమౌతుందని చెప్పారు. ఆస్వస్థత కారణంగా కొన్నాళ్ళు ఈమె ఉద్యమంలో పాల్గొన లేదు. ఆరోగ్యం కురుటపడ్డాక మళ్ళీ చురుకుగా రాజకీయాలలో పాల్గొన్నారు.
1942 ఆగష్టు 8న బొంబాయిలో సమావేశమైన కాంగ్రెసు'క్విట్ ఇండియా' తీర్మానాన్ని ఆమోదించింది. ఆ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఈమెను ప్రభుత్వం అరెస్టు చేసి 21నెలలు జైలులో ఉంచి అనారోగ్య కారణాలపై విడుదల చేసింది.
సరోజినీ నాయుడు హైదరాబాద్ లో నివసించిన యింటిపేరు “స్వర్ణ ప్రాంగణం" 'గోల్డెన్ త్రెషోల్డ్' ఆ పేరుననే తమ మొదటి కవితా సంకలనాన్ని 1905లో సరోజినీ నాయుడు గారు ప్రకటించారు. హైదరాబాద్ నగరాన్ని దర్శించిన ప్రముఖులెందరో ఆ యింట సరోజినీ నాయుడు ఆతిథ్యం పొందారు. గాంధీజీ 1929 ఏప్రిల్6న 1934 మార్చి 9న ఆయింట బస చేసినారు. దివంగత భారత ప్రధాని ఇందిరా గాంధి 17-11-1975న ఆ భవనాన్ని జాతికి అంకితం చేశారు. ఈ నాటికి ఆ గృహంలో హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయమునకు సంబంధించిన కొన్ని విభాగాలు నడుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని 'అబీడ్స్' ప్రాంతంలోని 'స్వర్ణ ప్రాంగణం' భవనం ఆనాటి చరిత్రకు, సరోజినీ నాయుడుగారి కుటుంబ దాతృత్వానికి సాక్ష్యంగా నేటికీ నిలిచియున్నది.
12 ఇంగ్లాండులో సరోజినిగారు రాసిన కవిత్వమంతా ఆ ఒంటరితనపు ఆలోచనల నుండి జనించినట్లుగా సాహితీవిమర్శకుల భావన. ఇతరుల కష్టాల్ని సరోజినీ నాయుడుగారు ఓపికగా, జాలిగా వినేవారు. కాని తన బాధల్ని తనలోనే దిగమంగుకునేవారు. దుఃఖంలోగాని, ఆనందంలోగాని క్షణాలలోనే అవేశపు అంచులదాక వెళ్లేవారు. మిత్రులెవరైనా వారిని నిర్లక్ష్యం చేస్తే, అవేదన చెందేవారు, చాల తక్కువగా మాట్లాడేవారు. సరోజినీ నాయుడుగారు పదుగురిని ఆకర్షించి, వారి ఆదరాభిమానాలు పొంది ఉన్నతస్థాయి వ్యక్తిగా ఎదిగారు. అందుకు వారిలోగల 'వకృత్వం' ఎంతో ఉపయోగపడింది. వారి ప్రసంగం శ్రోతలను మంత్ర ముగ్ధుల్ని చేసేది. వారి ప్రసంగాలు వినేవారికి ఎవరికి వారిని ఎదురుగా కూర్చొనపెట్టి వ్యక్తిగతంగా చెప్పుచున్నట్లు అనిపించేది. ఆప్రసంగాలలో సరోజినిగారు చెప్పేది. కవిత్వం అనిపించేది వీరి ఉపన్యాసాలలో ఎప్పుడో ఎవరో చెప్పిన అరువు తెచ్చుకున్న భావాలను వెలువరించేవారు కాదు. నిత్య నూతనంగా భావాలు వెలిబుచ్చేవారు. అవన్నీ సరోజినిగారు. సృష్టించినవే అయివుండేవి దాంతో సరోజినిగారు గొప్ప వ్యక్తగా పేరు పొందారు. ప్రసంగాలలో కవిత్వం సంగీతంలా జాలువారు తుండటంతో 'భారతకోకిల' గా పేరు పొందారు.
స్నేహితుల్ని సంపాదించుకొనుటలోను, ఆ స్నేహాల్ని నిత్యనూతనంగా మలుచుకొనటంలోను, సరోజినీదేవిగారు బహునేర్పరి. ఈ లక్షణం వారి వ్యక్తిత్వంలో ప్రస్ఫుటమయ్యే మరో గొప్ప అంశం వారు వయస్సు స్థాయిహోదాలతో సంబంధం లేకుండా స్నేహాలు చేసేవారు. ఆ స్నేహాలు చిన్ని మొక్కగా మొదలై మహా వృక్షంలా విస్తరించేవి. అందుకు కారణం వారితో సరోజినీ | నాయుడుగారు ఉత్సాహభరితంగా గడుపుట మాత్రమే కాదు. స్నేహితుల్ని పొగడ్తలతో ముంచెత్తటం అసలు కాదు. సరోజినీ నాయుడుగారు తన స్నేహితులు ఎవరైనా ఆపదలో అవసరాలలో వుంటే వెళ్ళి వారిపై శ్రద్ధాసక్తులు ప్రేమాభిమానాలు చూపేవారు వారి దు:ఖాలకు చలించిపోయేవారు, వారి కష్టాల్ని మనస్పూర్తిగా పంచుకునేవారు వారి స్నేహితులెవరైనా భౌతికంగా దూరమైతే శోక సముద్రంలో మునిగిపోయేవారు. ఈమెగారు తన మిత్రులు, గురువులైన గోఖలేజీ, గాంధీజీ మరణించినపుడు విలవిల్లాడారు.
ఎక్కడ, ఎలా, ఎంతవరకు మాట్లాడాలో సరోజినీ నాయుడుగారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో అనిపిస్తుంది. ఎవరికీ కష్టం కలగకుండాను, తన భావాల్ని ఆలోచనల్ని దాచకుండాను కుండబద్దలు కొట్టి చెప్పే విద్యలో ఆమెకు ఆమే సాటి. సరోజినీ నాయుడుగారు ఎక్కడకు వెళ్ళినా వారి మాట వినకుండా చెప్పిన పని చేయకుండా వుండగలిగేవారు కాదు.
సరోజినిగారి లోతైన హృదచం ధైర్యంతో నిండి వుండేది. ఆత్మనూన్యతా భావం కాగడాపెట్టి వెతికినీ వారిలో కన్పించేది. కాదు. ఎదుటివారిలో ఆభావం కన్పిస్తే ఊరుకునేవారు కాదు. ఎదుటివారి దు:ఖలకు, బాధలకు స్పందించినా, వారు విషాదంలో కొట్టుకుపోయేవారు కాదు. సరోజినిగారు గుండె నిబ్బరానికి పేరు ఎంత దుఃఖంలో మునిగివున్న వారిలోనైనా క్షణాల్లో ఆత్మ విశ్వాసాన్ని, ధైర్యాన్ని పురిగొల్పగలిగే నేర్పుండేది. సరోజినిగారిని ఏకాంతం అప్పుడప్పుడు బాధించేది కాని అంతలోనే తేరుకొని మనసు కుదుట పరచుకుని ధైర్యం వహించేది. గాంధీజీ హత్యకు గురైనపుడు దుఃఖంలో ఎంత కూరుకుపోయారో, అంతే ధైర్యంతో దేశ ప్రజలకు కర్తవ్యం బోధించారు.
1949 ఫిబ్రవరి మొదట్లో సరోజిని నాయుడు ఆరోగ్యం క్షీణించింది ప్రయాణంలో ఆమె తలకు దెబ్బ తగిలింది. తరచుగా తలనొప్పి వస్తూ ఉండేది. రక్తపు పోటు అధికమైంది. |శరీరం దుర్భలమై ఊపిరి తీసుకువటమే కష్టంగా మారింది. | ఆమెకు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. | ఫిబ్రవరి 28న ఆమెకు ఆక్సిజన్ పెట్టవలసి పరిస్థితి వచ్చింది. పరిస్థితి మెరుగుపడలేదు మార్చి ఒకటిన ఆమెకు విశ్రాంతి లేకపోయింది. పరామర్మకు వచ్చేవారు ఎక్కువైనారు. రాత్రి
10 గంటలకు ఇక ఎవరినీ కలవవద్దని చెప్పింది 2వ తేది తెల్లవారుజామున 3.30 గంటలకు తుది శ్వాస విడిచింది.
దేశ సేవలో జీవించిన సరోజినీ నాయుడిగారి జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం ఒక పోస్టల్ స్టాంపును రూపొందించారు. 1964 ఫిబ్రవరి 13న ఆ తపాలా బిళ్ల విడుదల చేశారు. జీవితాన్ని ఇంద్ర ధనస్సులా అందంగా చిత్రించుకొని నవరసాలు ఒలకపోసిన వ్యక్తి సరోజినీనాయుడుగారు, తన దంతా స్వంత వ్యక్తిత్వాన్ని సృష్టించుకొని దేశానికి నాయకురాలై సర్వాన్ని ప్రజలకోసం త్యాగం చేశారు. భారత కోకిల కవిత్వం భారతీయులకు గర్వకారణం అందుకే సరోజినీ నాయుడుగారి జీవితం మనందరికీ అదర్శం.