-Advertisement-

పొట్టి శ్రీరాములు |about potti sriramulu in telugu

SCHOOLS VISION

 

పొట్టి శ్రీరాములు

“తమపై తమకు నమ్మకం ఉన్న కొందరు వ్యక్తుల జీవితమే ఆ దేశ చరిత్ర అవుతుందని" స్వామీ వివేకానంద ఒక సందర్భంలో చెప్పారు. ఆ వ్యక్తుల కోవకు చెందినవారే పొట్టి శ్రీరాములుగారు. ఏవర్గానికి నాయకునిగా నిలువక, జీవితపు చరమాంకంలో విశ్వరూపం ఈ ప్రపంచానికి చూపిన ఘనుడు పొట్టి శ్రీరాములు. వారి జీవితం సామాన్యులు మాన్యులవటానికి వీలుందనే సందేశాన్ని మనకు ఇస్తుంది. తనపై తనకు నమ్మకం ఉన్న శ్రీరాములుగారి జీవితం భారతదేశపు చరిత్రలో ఒక భాగమైంది.పొట్టి గురవయ్య, మహలక్ష్మమ్మ దంపతులు ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతం పడమటి పల్లె గ్రామానికి చెందినవారు. వీరిది వ్యాపారస్తులు కుటుంబం. చిల్లర వెచ్చాలు అమ్మి జీవించేవారు. ఒకప్పుడు ఈ ప్రాంతం నెల్లూరు జిల్లాలో ఉండేది. కరువు పరిస్థితులలో చెన్నై నగరానికి వలస వెళ్లారు. వారికి మూడవ సంతానంగా 1902 సెప్టెంబరు 12న ఒక బాలుడు - జన్మించాడు. వారికి మూడవ శ్రీరాములు. శ్రీరాములుగారి తండ్రి గురవయ్య 1908లో మరణించారు. ఆనాటికి వీరి వయస్సు ఆరేళ్లు. తండ్రి మరణించిన తరువాత వీరు బళ్లారిలోని పినతల్లి ఇంట ఒక ఏడాది ఉన్నారు. దాంతో విద్యాభ్యాసం ఆలస్యంగా ప్రారంభమైంది. మొదట శ్రీరాములు చెన్నైలోని ఒక వీధిబడిలో చేరి ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఇబ్బందులను ఎదుర్కొంటూ నాలుగేళ్లు కష్టపడిన శ్రీరాములుగారు 1924లో కోర్సును పూర్తి చేశారు. శానిటరీ ఇంజనీరింగ్ డిప్లమో పొందారు. శ్రీరాములు ముంబైలో ఇంజనీరింగ్ డిప్లమో కోర్సును అభ్యసించిన ఆఖరి ఏడాదిలో వివాహం చేసుకున్నారు. వీరి మేనమామ గునుపూడి నర్సయ్య చెట్టిగారు వారి కుమార్తె సీతమ్మను వవాహం చేసుకొనవలసిందిగా తల్లి వీరిని కోరారు. తల్లి కోరిక మేరకు కట్న కానుకలు లేకుండా శ్రీరాములు నిరాడంబరంగా వివాహమాడారు.అది 1930 ప్రాంతం బ్రిటిష్ పాలకుల్ని ఎదుర్కొనేందుకు గాంధీజీ 'ఉప్పు’ను ఆయుధంగా స్వీకరించారు. గాంధీజీ 'ఉప్పు సత్యాగ్రహం' నిర్వహించే మహత్తర క్షణాలకోసం దేశమంతా ఎదురు చూస్తోంది. ఎవరూ ఎవరినీ బొట్టు పెట్టి పిలువకుండానే తమ ఆత్మ ప్రబోధాలను లోబడి భారతీయులు వీధుల్లోకి వస్తున్నారు. ప్రజల్ని దేశమాత కోసం త్యగాలకు సిద్ధం చేస్తున్న స్వచ్ఛంద వాతావరణం. శ్రీరాములు ముంబైలో ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే గాంధీగారి సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. గాంధీజీ ఆదర్శ నిరాడంబర జీవితం శ్రీరాములుగారికి ఎంతో నచ్చింది.


శ్రీరాములు ముంబై నుంచి గుజరాత్లోని సబర్శతి ఆశ్రమానికి చేరారు. అది 1930 ఏప్రిల్ 16. అక్కడ ఆశ్రమ కార్యదర్శి నారాన్దాస్ గాంధీ. ఆనాటికే శ్రీరాములు గారిని ఆశ్రమంలో చేర్చుకునే విషయంపై గాంధీజీ నారాన్దాస్ గాంధీకి ఉత్తర్వులు పంపారు. శ్రీరాములుగారిని సాదరంగా ఆహ్వానించిన నారాన్దాస్ ఆశ్రమ నిబంధనల మేరకు ప్రమాణ కార్యక్రమం నిర్వహించారు. దాంతో సబర్మతీ ఆశ్రమవాసిగా శ్రీరాములు మారారు. ఆ ఆశ్రమంలో గడిపిన మూడేండ్ల పాటు తాను చేసిన ప్రమాణాలను తు.చ తప్పకుండా పాటించారు. అక్కడ చేసే సేవలకుగాను ఆశ్రమవాసులకు కొంత గౌరవ వేతనం 12 రూపాయలు ఇచ్చేవారు. భోజన నిమిత్తం ఆరు రుపాయలు పోగా మిగిలిన మొత్తం నగదు రూపంలో ఇస్తారు. ఆశ్రమ వాసులు కొందరు ఆ నగదును ఖర్చు చేసేసి, ముందస్తు మొత్తం కోసం నిర్వాహకులను అడుగుతుండేవారు. కాని శ్రీరాములు తనకు ఇచ్చిన ఆరు రూపాయలలో కొంత మిగిల్చి, తిరిగి ఆశ్రమానికే జమచేసేవారు. డబ్బు విషయంలో శ్రీరాములు పొదుపుగా వాడతారని, నిక్కచ్చిగా ఉంటారని ఆశ్రమంలో పేరు పొందారు. దాంతో ఆశ్రమవాసుల డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు నిర్వహించే బాధ్యత శ్రీరాములుగారికి అప్పగించారు.


గాంధీజీ ఉపదేశించిన నిర్మాణ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు పరిచే లక్ష్యంతో జాతీయ స్థాయిలో 'గంధీ స్మారక నిధి' ని 1950లో ఏర్పరచారు. జాతీయ స్థాయిలో ట్రస్టు | బోర్డుతో పాటు ప్రతి రాష్ట్రంలో ఒక సంచాలకుని నియమించి వారి క్రింద ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రరాష్ట్రంలో ఈ నిధి నిర్వహణకు శ్రీరాములుగారిని సంచాలకునిగా నియమించారు. ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించేందుకు గాంధీ స్మారక నిధికి 1952 అక్టోబరు 16 నుంచి పదవీ బాధ్యతలు వదిలేశారు.


భాషా ప్రయుక్త రాష్ట్రాల కమీషన్ 1948 జూన్ 17న ఏర్పడింది. పదవీ విరమణ చేసిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.కె. థార్ ఆ కమీషన్కు అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఆయన పేరున ఆ కమీషన్ 'థార్ కమీషన్' గా పిలువబడింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే జాతీయత దెబ్బతింటుందని ఆ కమీషన్ అభిప్రాయపడింది. ఒకవేళ భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పరచినా, ముంబై, చెన్నై వంటి నగరాలను ఏ రాష్ట్ర పరిధిలోకి చేర్చకుండా స్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వాలని ఆ కమీషన్ సూచించింది.


కేంద్ర ప్రభుత్వం థార్ కమీషన్ నివేదికను ప్రక్కన పెట్టింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలపై జాతీయ కాంగ్రెస్ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పరచింది. ఆ కమిటీలో జవహర్లాల్ నెహ్రు, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య సభ్యులు. ఆ ముగ్గురి పేరు 'జె.వి.పి. కమిటీ' గా దానికి పేరు వచ్చింది. 1949 ఏప్రిల్ 6న ఆ కమిటీ నివేదిక సమర్పించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కొంతకాలం వాయిదా వేయాలని ఆ కమిటీ సూచించింది. కాని చెన్నై నగరంపైన హక్కును ఆంధ్రులు వదులుకుని, పొరుగు రాష్ట్రాలకు అభ్యంతరం లేని ప్రాంతాలతో అయితే ఆంధ్ర రాష్ట్రం వెంటనే ఏర్పరచుకోవచ్చని షరతు పెట్టారు.


ప్రత్యేక రాష్ట్రంపైన ఉన్న మక్కువ కొద్దీ పడుతున్న తొందరను ఆంధ్రుల బలహీనతగా భావిస్తున్నారేమో అనే అనుమానం శ్రీరాములుగారికి కలిగింది. స్వామీ సీతారామ్ నిరసన దీక్ష అర్ధంతరంగా ఆగిపోయింది. నిరాహార దీక్షలు ఒట్టి బెదిరింపులు మాత్రమేననే హేళన భావం అన్ని వర్గాల్లోనూ పెరిగింది. ఎవరో ఒకరు ఆత్మార్మణ చేస్తే తప్ప ఆంధ్రరాష్ట్రం రాదనే భావన కలిగి శ్రీరాములగారిలో స్థిరపడింది. ప్రజాభిమానం గల పెద్దనాయకులే అందుకు పూనుకోవాలని, వారి నిరసన దీక్షే ఆంధ్ర సమస్యకు పరిష్కారమని 1949 నాటికే శ్రీరాములుగారు అభిప్రాయపడ్డారు.


అది 1952 అక్టోబరు 19 సమయం ఉదయం 10 గంటలు


చెన్నై నగరం, మైలాపూర్, రాయపేట, హై రోడ్డు లజ్ కార్నర్లోని 126వ నెంబరు భవనం స్వతంత్ర భారత చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించదగిన ఒక అధ్యాయానికి శ్రీకారం చుట్టిన క్షణాలు అవి. ఒక సామాన్యుడు మాన్యులైన ఘటన. ఓ వామనుడు విశ్వరూపం ప్రదర్శించిన సంఘటన. ఆ సామాన్యుడెవరో కాదు, ఆ వామనుడెవరో కాదు. నూరు పైసలా ఆంధ్రుడు పొట్టి శ్రీరాములు.శ్రీరాములగారి ఆరోగ్యం క్షీణిస్తున్న కొద్దీ ప్రజలలో ఆవేశకావేశాలు పెరుగుతూ వచ్చాయి. శ్రీరాములుగారికి రక్తపోటు స్థాయి పడిపోయింది. శారీరకంగా పరిస్థితి దిగజారుతున్నా, మానసికంగా ఎంతో ధైర్యంతో నిలిచారు. శ్రీరాములుగారు నిరసన దీక్ష 55వ రోజున డాక్టరు నారాయణమూర్తి గారిని దగ్గరకు పిలిచారు. ఒక వేళ తనకు స్పృహ పోయిన పక్షంలో తన నిరాహార దీక్షకు భంగం కలిగించే విధంగా ఏమీ చేయవద్దని శ్రీరాములుగారు డాక్టరుకు చెప్పారు. దీక్ష 57వ రోజున దీక్షను విరమించమని డాక్టరు నారాయణమూర్తి, బులుసు సాంబమూర్తిగారు శ్రీరాములగారిని కోరారు. ముక్కుమీద వేలు వేసుకుని శ్రీరాములుగారు వద్దని తల ఊపారు.


10


వారందరికీ అవును, కాదు అంటూ మౌనంగా చిరునవ్వుతో సమాధానమిస్తుండేవారు శ్రీరాములుగారు. నిరసన దీక్ష ప్రారంభించిన 58వ రోజుకు శ్రీరాములు 35 పౌండ్ల బరువు తగ్గారు. ఆనాటికి శ్రీరాములుగారి బరువు 84 పౌండ్లు మాత్రమే. గొంతు వాచిపోయింది. నీరు త్రాగటం కష్టమై పోయింది. నోటి నుండి దుర్వాసన మొదలైంది. తరచుగా స్పృహపోతుంది. రాత్రి 10గంటల సమయానికి గుండె చప్పుడు సరిగా వినిపించటం లేదు. శాశ్వ ఆడటం ఇబ్బందికరంగా మారింది. రాత్రి గం. 11-20 ని.లకు గుండె ఆగిపోయింది.


అది 1952 డిశంబరు 15. శ్రీరాములుగారి దీక్షను వెకిలిగా విమర్శించిన మహానాయకులు ప్రజా న్యాయస్థానంలో సిగ్గుగా నిలబడవలసిన సమయం పాలు త్రాగిన రొమ్మునే గుద్దిన దుర్మార్గుపు పుత్రుల్ని కన్న తల్లి మనోవేదన ఎవరికి తెలుస్తుంది. పదవుల కోసం పరాయివారి పంచల్లో తలదాచుకున్న ఆంధ్ర నాయక మన్యులు ఏకాలంలోనూ ఎవరికీ నాయకులుగా ఉండకూడదని ఆంధ్రులు ఘోషిస్తున్న సమయం రాత్రి గం 11-23 నిమిషాలు శ్రీరాములుగారు తుదిశ్వాస విడిచిన మహోన్నత, చారిత్రక క్షణాలు.


ప్రజలు కడసారిగా వీక్షించగలిగేలా శ్రీరాములు గారి భౌతికకాయాన్ని రోడ్డు మధ్య ఒక వేదికపై ఉంచారు. అక్కడ గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు మోపర్రు దాసు మొదలైనవారు రఘుపతి రాఘవరాజారాం అంటూ భక్తి గీతాలను ఆలపిస్తుంటే మరొక ప్రక్క భగవద్గీత, బైబిలు, ఖురాన్ పవిత్ర గ్రంథాలను కొందరు మత బోధకులు పఠించారు. రెండెడ్లు బండిమీద అలంకిరించిన ఒక రథం మీద శ్రీరాములుగారి భౌతిక కాయాన్ని ఉంచారు. * ఊరేగింపుగా అంతిమ యాత్ర ప్రారంభమైంది.


వేలాదిగా ప్రజలు ఈ యాత్రలో పాల్గోన్నారు. భాషాభేదాలు లేవు. కులమతాలు లేవు. ప్రాంతీయ భావాలు లేవు. అందరూ దుఃఖం నిండిన గుండెలతో భారంగా ఆ యాత్రలో నడిచారు. ఘంటసాల - మోపర్రు దాసుగార్లు జాతీయ గీతాలను యాత్రవెంబడి పాడారు. బులుసు సాంబమూర్తిగారి ఇంటినుంచి ప్రారంభమైన ఆ అంతిమయాత్ర రాయపేట హైవే, అన్నాసెలై, సెంట్రల్ రైల్వేస్టేషను, పూల బజారు మీదుగా సాగింది. హిందూ మత ఆచారాల ప్రకారం అంత్యక్రియలు జరిగాయి. శ్రీరాములగారి సోదరులు రంగయ్య చందనపు కట్టెలతో ఏర్పరచిన చితికి నిప్పు అంటించారు. శ్మశాన వాటికలో చిన్న సంతాపసభ జరిగింది. ఆ సభలో ప్రసంగించిన ప్రకాశంగారు తనకు నిరసన వ్రతాలపైన నమ్మకం లేదని, కాని నిరసన వ్రతంతో ఏమి సాధించవచ్చో నిరూపించిన శ్రీరాములు 'అమరజీవి' అని చెప్పారు.


శ్రీరాములుగారి భౌతిక కాయం చితి మంటలకు ఆహుతి అవుతుండగా ఆంధ్ర రాష్ట్రాన్ని అసంతృప్తి జ్వాలలు చుట్టుముట్టాయి. ఆంధ్రుల ఆవేశం కట్టలు తెంచుకుని ప్రవహించింది. అన్ని చోట్ల బందులు, హర్తళ్లు పాటించారు. ఎక్కడిరైళ్లను అక్కడే నిలిపేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. కేంద్ర నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు మిన్నుముట్టాయి. ఆంధ్రదేశం స్థంబించి పోయింది.


భాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమలో రాజధాని ఉండాలని రామలసీమ సభ్యులు పట్టుకుట్టారు. ఏకాభిప్రాయానికి రాలేక ఆ నిర్ణయ భారాన్ని ప్రకాశం పంతులుగారిపై పెట్టారు. బులుసు సాంబమూర్తి గారిని | సంప్రదించి కర్నూలును రాజధానిగా ప్రకాశంగారు | సూచించారు. దానిపై గుంటూరు విజయవాడగా కమ్యూనిస్టు సభ్యులు సవరణ ప్రతిపాదించారు. దాంతో ఓటింగ్ జరిగింది. ఒక్క ఓటు తేడాతో గుంటూరు - విజయవాడ రాజధానిగా | ఉండాలనే ప్రతిపాదన వీగిపోయింది. దాంతో నూతన రాష్ట్ర రాజధానిగా కర్నూలు ఖరారైంది.


14 ప్రకాశం పంతులుగారిని నూతన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. ముఖ్యమంత్రిగా చెన్నై నగర విషయంలో పొట్టి శ్రీరాములుగారి కోరికను తీర్చే వీలు కలుగుతుందని ప్రకాశంగారు భావించారు. ముఖ్యమంత్రి పదవిని స్వీకరించారు. నీలం సంజీవరెడ్డిగారు ఉప ముఖ్యమంత్రి పదవిని స్వీకరించారు. 1953 అక్టోబరు 1న భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రు కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రారంభించారు. 1953లో భాష ప్రాదిపదికన ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. భాష ఆధారంగా తమ రాష్ట్రాలను కూడా పునర్వ్యవస్థీకరించాలని వివిధ రాష్ట్రాల ప్రజలు ఆందోళనలు ప్రారంభించారు. కేంద్రం 'రాష్ట్రాల పురద్విభజన కమీషన్' ను నియమించింది. ఫజల్ ఆలీ ఆ కమీషన్కు నేతృత్వం వహించారు. 1955 అక్టోబరు 10న ఆకమీషన్ తన నివేదికను సమర్పించింది. ఆ సందర్భంలో హైదరాబాదు రాష్ట్రం నుంచి తెలుగవారి 'తెలంగాణా' ప్రాంతాన్ని విడదీయాలని, విశాల ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరచాలిన అభిప్రాయాలు వెలువడ్డాయి. ఫజల్ అలీ కమీషన్ నివేదికను అనుసరించి రాష్ట్ర పునర్విభజన శాసనాన్ని' పార్లమెంటు చేసింది. తదనుగుణంగా తెలంగాణా కలిసిన 'ఆంధ్రప్రదేశ్' 1956 నవంబరు 1న ఏర్పడింది. విశాలాంధ్రతోపాలుగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి భాషా ప్రయుక్త రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయి.15


|ఆంధ్ర రాష్ట్రవతరణ కోసం అసువులు బాసిన అమరజీవి | పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల గుండెల్లో కలకాలం భద్రంగా | ఉంటారు. శ్రీరాములుగారు ఆత్పార్పణ చేసిన నాలుగు రోజుల | తరువాత 1954 డిసెంబరు 19న 'పొట్టి శ్రీరాములు మిషన్' చెన్నైలో స్థాపించారు. కొన్ని దశాబ్దాలపాటు వ.ఎస్. శాస్త్రిగారు ఆ సంస్థ గౌరవ కార్యదర్శి హోదాలో కృషి చేశారు. వారి | నిరంతర శ్రమ ఫలితంగా శ్రీరాములు ఆత్మాహుతైన భవనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేశారు.


ఆ తరువాత 'పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ' 1954 | ఆగస్టు 29న ప్రారంభమైంది. ఆసంస్థ తరపున శ్రీరాములగారు ఆత్మర్పణ చేసిన భవనం 'అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక 'భవనం' గాతీర్చి దిద్దారు.తన జీవితాన్ని పణంగా పెట్టి అయినా దేశానికి మేలు చేయాలని పలు సందర్భాలలో ప్రయత్నించారు. ఆంధ్ర రాష్ట్ర స్థాపన విషయాన్ని తేల్చేందుకు ఏ నాయకుడూ మనస్పూర్తిగా కృషి చేయలేక పోతున్నారని భావించారు. తాను ఆత్మాహుతి చేసుకుంటేనన్నా ఆ నాయకులు కళ్లు తెరుస్తారేమోనని ఆశపడి ప్రాణాలు విడిచారు.


రాజకీయ పట్టువిడుపులు, లౌక్యం ప్రదర్శించటం వీరికి తెలియదు. అందువల్లనే మహోన్నత పదవులు అధిరోహించే అర్హతలున్నా ప్రాణత్యాగం చేశారు. నమ్మిన దానిని నిర్భయంగా అమలుచేసి సత్యాహింసలను నమ్మేవారందరికీ శ్రీరాములుగారి జీవితం ఆదర్శం.
Comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.

-Advertisement-