-Advertisement-

Class 4 EVS Bit bank | 4th Class EVS Bitbank in TELUGU| PART 4

cbse class 4 evs,evs class 4,class 4 evs,evs for class 4,cbse class 4 evs syllabus,pebbles cbse class 4 evs,cbse class 4 evs solutions,evs,class 4 tut
SCHOOLS VISION

Class 4 EVS Bit bank | 4th Class EVS Bitbank in TELUGU| PART 4

Q1: చీమకు ఎన్ని కాళ్ళు ఉంటాయ?

➊ నాలుగు
➋ ఆరు
➌ ఎనిమిది
➍ పది

Correct answer: ఆరు
చీమ తోపాటు మిగిలిన కీటకాలన్నింటికీ ఆరు కాళ్లు ఉంటాయి.

Q2: జీవవైవిద్యం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది?

➊ నీటిలో
➋ ఇసుకలో
➌ పట్టణాలలో
➍ అడవులలో

Correct answer: అడవులలో
ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాలైన జంతువులు పక్షులు, కీటకాలు మొక్కలు, చెట్లు వీటన్నింటినీ జీవవైవిద్యం అంటారు. అడవుల్లో జీవవైవిద్యం ఎక్కువగా ఉంటుంది.

4th class parisarala vignanam questions

Q3: ఈ భూమి మీద జంతువులన్నిటికీ ఈ హక్కు ఉంది?

➊ ఆహారం పొందే హక్కు
➋ స్వేచ్ఛా హక్కు
➌ జీవించే హక్కు
➍ భావవ్యక్తీకరణ హక్కు.

Correct answer: జీవించే హక్కు
ఈ భూమి మీద గల జంతువులన్నింటికీ జీవించే హక్కు ఉంది.

Q4: జీవ వైవిధ్యానికి ముప్పును కలిగించే వాయువులు?

➊ కార్బన్డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్
➋ నైట్రోజన్, హీలియం
➌ హైడ్రోజన్, నైట్రోజన్
➍ ఆక్సిజన్

Correct answer: కార్బన్డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్
జీవ వైవిధ్యానికి కార్బన్డయాక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్లు హాని కలిగిస్తున్నాయి.

Q5: ప్రస్తుతం భూమి మీద కనిపించని జీవజాతి?

➊ తెల్ల పులి
➋ డైనోసార్
➌ బట్టమేక
➍ కలివికోడి

Correct answer: డైనోసార్
ప్రస్తుతం భూమి మీద కనబడనటువంటి జీవులు డైనోసార్లు.

Q6: ఈ క్రింది వాటిలో అంతరించిపోతున్న జీవులు?

➊ తెల్ల పులులు
➋ సింహాలు
➌ జిరాఫీలు
➍ ఏనుగులు

Correct answer: తెల్ల పులులు
తెల్ల పులులు రాను రాను అంతరించిపోతున్నాయి

Q7: వివిధ రకాలైన సేకరించిన చిత్రాలతో కూడుకున్న పుస్తకం?

➊ HERBARIUM
➋ NOTE BOOK
➌ SCRAP BOOK
➍ GRAPH BOOK

Correct answer: SCRAP BOOK
స్క్రాప్ బుక్ లో మనం సేకరించినటువంటి వివిధ రకాల జంతువుల పక్షుల చిత్రాలను అంటిస్తాము. న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ కూడా అంటిస్తాము.

Q8: క్రింది వానిలో తీగ మొక్క/ ఎగబాకే మొక్క ఏది?

➊ గులాబీ
➋ కాకర
➌ మోదుగ
➍ అరటి

Correct answer: కాకర
బీర కాకర మల్లె మొదలైనవి తీగ మొక్కలు వీటిని ఎగబాకే మొక్కలు అని కూడా అంటారు.

Q9: ఈ క్రింది మొక్కలలో కాండం బలహీనంగా ఉంటుంది?

➊ పొదలు
➋ వృక్షాలు
➌ తీగలు
➍ పైవన్నీ.

Correct answer: తీగలు
తీగల్లో మొక్కల కాండాలు బలహీనంగా ఉండడం వల్ల పందిళ్లపై చెట్లపై ఏదో ఒక ఆధారంపై పెరుగుతాయి.

Q10: ఈ క్రింది వానిలో పొదలు ఏవి?

➊ బీర మరియు కాకర
➋ చింత మరియు గులాబీ
➌ చింత మరియు రావి
➍ పది

Correct answer: గన్నేరు మరియు గులాబీ
మొక్కల మొదలు భాగము నుండి ఎక్కువ కొమ్మలు రావడం వలన గుబురులుగా కనిపిస్తాయి అందుకే వీటిని పొదలు అంటారు.

Q11: ఈ క్రింది వానిలో వృక్షాలు ఏవి?

➊ చింత ,రావి ,మామిడి
➋ గన్నేరు, గులాబీ, చింత
➌ బీరా, కాకర ,చిక్కుడు
➍ వేప, అరటి ,కాకర

Correct answer: చింత ,రావి ,మామిడి
వృక్షాలు విశాలంగా పెద్దగా పెరుగుతాయి. వీటి కాండం దృఢంగా పొడవుగా ఉండడం వల్ల నీడ దొరుకుతుంది కలప లభిస్తుంది.

Q12: మొక్కకు పోషక పదార్థాలు దీని ద్వారా అందుతాయి?

➊ కాండం ద్వారా
➋ ఆకుల ద్వారా
➌ కొమ్మల ద్వారా
➍ వేర్ల ద్వారా

Correct answer: వేర్ల ద్వారా
వేర్ల ద్వారానే మొక్కలకు నీరు మరియు పోషక పదార్థాలు అందుతాయి.

Q13: వేర్లు గ్రహించిన నీటిని పోషక పదార్థాలను మొక్క అన్ని భాగాలకు సరఫరా చేసేది?

➊ కాండం ద్వారా
➋ ఆకుల ద్వారా
➌ కొమ్మల ద్వారా
➍ వేర్ల ద్వారా

Correct answer: కాండం
వేర్లు గ్రహించిన నీటిని మరియు పోషకపదార్థాలను మొక్క యొక్క అన్ని భాగాలకు సరఫరా చేసేది ఒక కాండం మాత్రమే.

Q14: మొక్కలు ఆహారం ఎక్కడ తయారవుతుంది?

➊ కాండం
➋ ఆకులు
➌ వేర్లు
➍ దారు కణజాలం

Correct answer: ఆకులు
మొక్కల యొక్క ఆకుల్లో ఆహారం తయారవుతుంది.

Q15: ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం?

➊ పత్ర హరితం/ క్లోరోఫిల్
➋ ఆక్సిజన్
➌ నీరు
➍ వాతావరణం

Correct answer: పత్ర హరితం/ క్లోరోఫిల్
మొక్కల ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణము పత్రహరితం లేదా క్లోరోఫిల్.

Comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.

-Advertisement-