Important Questions on Rythu Bandhu scheme Telangana

Share:

Important Questions on Rythu Bandhu scheme Telangana

Q1: రైతుబంధు లబ్ధిదారుల్లో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది?

➊ నిజామాబాద్
➋ కరీంనగర్
➌ నల్గొండ
➍ మేడ్చల్ మల్కాజ్గిరి

Correct answer: నల్గొండ
రైతుబంధు పంపిణీలో అంటే రైతులు లబ్ధి పొందిన జిల్లాలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా నల్గొండ అయితే ఈ నల్గొండ జిల్లాకు రైతుబంధు సాయం 601.74 కోట్లు. లబ్ధి పొందిన రైతుల సంఖ్య 4 లక్షల 69 వేల మంది.

Q2: తెలంగాణలో రైతు బంధు పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

➊ 2014
➋ 2015
➌ 2018
➍ 2019

Correct answer: 2018
తెలంగాణలో రైతుబంధు పథకాన్ని 2018 మే 10వ తేదీన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ప్రారంభించారు.


Rythu Bandhu details Telangana

Q3: రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ఏ జిల్లాలో ప్రారంభించారు?

➊ కరీంనగర్
➋ నల్గొండ
➌ రంగారెడ్డి
➍ మెదక్

Correct answer: కరీంనగర్
రైతు బంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ మండలము ,శాలపల్లి ఇందిరా నగర్ లో ప్రారంభించారు.

Q4: ఒక సంవత్సరానికి ₹10,000 పెట్టుబడి సాయం ఏ ఆర్థిక సంవత్సరం నుండి ఇస్తున్నారు?

➊ 2017-18
➋ 2018-19
➌ 2019-20
➍ 2020-21

Correct answer: 2019-20
పథకం ప్రారంభంలో అంటే 2018లో సీజన్కు 4000 రూపాయలు ఉండేవి మొత్తం సంవత్సరానికి వానాకాలం 4000 రూపాయలు యాసంగిలో 4000 రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల పెట్టుబడి సాయం ఇస్తుండేవారు.

Q5: రైతుబంధు తరహాలో "కాళియా" అనే పెట్టుబడి సాయం పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?

➊ పశ్చిమబెంగాల్
➋ ఝార్ఖండ్
➌ ఆంధ్ర ప్రదేశ్
➍ ఒడిశా

Correct answer: ఒడిశా
ఈ పథకంలో రైతు కుటుంబానికి 10000 రూపాయలు సంవత్సరానికి గాను, భూమిలేని వ్యవసాయ సంబంధ కార్యకలాపాలు నిర్వహించే కుటుంబానికి సంవత్సరానికి 12,500 ఇస్తారు.

Q6: అతి తక్కువ రైతుబంధు సాయం పొందే జిల్లా ఏది?

➊ మేడ్చల్ మల్కాజ్గిరి
➋ ఆదిలాబాద్
➌ నిర్మల్
➍ రంగారెడ్డి జిల్లా

Correct answer: మేడ్చల్ మల్కాజ్గిరి
రైతుబంధు పంపిణీలో అతి తక్కువ లబ్ధి పొందే జిల్లా ఏదంటే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. పెట్టుబడి సాయం 33 కోట్ల 65 లక్షలను 33352 మంది రైతులు పొందుతున్నారు.

Q7: రైతుబంధు తరహాలో కృషక్ బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది?

➊ ఆంధ్రప్రదేశ్
➋ పశ్చిమబెంగాల్
➌ ఝార్ఖండ్
➍ ఒడిశా

Correct answer: పశ్చిమబెంగాల్
రైతుబంధు తరహాలో కృషక్ బంధు అనే పథకాన్ని పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో పెట్టుబడి సాయం సంవత్సరానికి గాను 5000 రూపాయలు.

Q8: "ముఖ్యమంత్రి కృషి ఆశీర్వాద యోజన" అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?

➊ తమిళనాడు
➋ పశ్చిమబెంగాల్
➌ ఒడిశా
➍ ఝార్ఖండ్

Correct answer: ఝార్ఖండ్
ఝార్ఖండ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కృషి ఆశీర్వాద యోజన అనే పెట్టుబడి సాయం పథకాన్ని రైతుబంధు తరహాలో ప్రవేశపెట్టింది.

Q9: 2022-23 బడ్జెట్లో రైతుబంధుకు కేటాయించిన రూపాయలు ఎన్ని?

➊ 10,000 కోట్లు
➋ 14,000 కోట్లు
➌ 14,,500 కోట్లు
➍ 14,800 కోట్లు

Correct answer: 14,800 కోట్లు
తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకానికి 2022-23 బడ్జెట్లో 14,800 కోట్లను కేటాయించారు.

Q10: రైతు బంధు పథకంలో అర్హత గల భూ గరిష్ట పరిమితి ఎంత?

➊ మూడెకరాలు
➋ ఐదు ఎకరాలు
➌ పది ఎకరాలు
➍ మేడ్చల్ మల్కాజ్గిరి

Correct answer: భూమికి గరిష్ట పరిమితి లేదు
తెలంగాణ రైతు బంధు పథకంలో ఎన్ని ఎకరాల భూమికి అనేది లేదు. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతుబంధు వర్తిస్తుంది.

Q11: రైతు బంధు పథకం స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైయస్సార్ రైతు భరోసా ను ఎప్పుడు ప్రారంభించింది?

➊ 2018-19
➋ 2019-20
➌ 2020-21
➍ పైవేవీ కాదు.

Correct answer: 2019-20
తెలంగాణలో గల రైతుబంధు పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైయస్సార్ రైతు భరోసా అనే పథకాన్ని 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించింది.

Q12: 2023 జనవరి వరకు ఎన్ని సీజన్లకు రైతుబంధు సాయాన్ని అందించారు?

➊ 8 సీజన్లు
➋ 10 సీజన్లు
➌ 11 సీజన్లు
➍ 12 సీజన్లు

Correct answer: 10 సీజన్లు
2023 జనవరి వరకు రైతుబంధు సాయాన్ని 10 సీజన్లకు అందించారు.

Q13: ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ రైతు భరోసా ఒక సంవత్సరానికి పెట్టుబడి సాయం ఎంత?

➊ 7500 రూపాయలు
➋ 10000 రూపాయలు
➌ 5000 రూపాయలు
➍ 12 వేల రూపాయలు

Correct answer: 7500 రూపాయలు
ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ రైతు భరోసా పథకం కింద ఒక సంవత్సరానికి గాన్ని పెట్టుబడి సాయం 7500 రూపాయలు.

Q14: రైతు బంధు పథకం ఎటువంటి భూములకు వర్తిస్తుంది?

➊ వ్యవసాయ భూములకు
➋ వ్యవసాయతర భూములకు
➌ పై రెండింటికి
➍ పైవేవీ కావు

Correct answer: పై రెండింటికి
ఈ రైతు బంధు పథకం అనేది వ్యవసాయ మరియు వ్యవసాయతర భూములకు కూడా వర్తిస్తుంది.

Q15: రైతు బంధు పథకం ద్వారా ఎంతమంది లబ్ది పొందారు?

➊ 40 లక్షల మంది
➋ 60 లక్షల మంది
➌ 63 లక్షల మంది
➍ 80 లక్షల మంది

Correct answer: 63 లక్షల మంది
తెలంగాణలో రైతుబంధు పథకం ద్వారా దాదాపు 63 లక్షల మంది లబ్ధి పొందారు.

No comments

Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.