-Advertisement-

Class 4 EVS Bit bank | 4th Class EVS Bitbank in TELUGU| PART 1

cbse class 4 evs,evs class 4,class 4 evs,evs for class 4,cbse class 4 evs syllabus,pebbles cbse class 4 evs,cbse class 4 evs solutions,evs,class 4 tut
SCHOOLS VISION

Class 4 EVS Bit bank | 4th Class EVS Bitbank in TELUGU| PART 1


Q1: పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టడం వల్ల ఏర్పడే కుటుంబం?

➊ ఉమ్మడి కుటుంబం
➋ సమిష్టి కుటుంబం
➌ వ్యష్టి కుటుంబం
➍ పెద్ద కుటుంబం

Correct answer: వ్యష్టి కుటుంబం
ఎక్కువగా కుటుంబాలలో అమ్మ నాన్న పిల్లలు మాత్రమే ఉంటున్నారు దీనిని వ్యష్టి కుటుంబం అంటారు .పెళ్లికాగానే వేరు కాపురం వలన ఇవి ఏర్పడతాయి.

Q2: కబడ్డీ ఆటలో ఆటగాళ్ల సంఖ్య ఎంత?

➊ 8
➋ 7
➌ 5
➍ 6

Correct answer: 7
కబడ్డీ ఆటలో ఒక జట్టులో ఏడుగురు ఆటగాళ్లు ఉంటారు.

Class 4 EVS Bit bank | 4th Class EVS Bitbank in TELUGU| PART 1

Q3: BARK LINE, MIDDLE LINE ,END LINE అనే పదాలు ఏ ఆటకు చెందినవి?

➊ కబడ్డీ
➋ క్రికెట్
➌ ఖోఖో
➍ టెన్నిస్

Correct answer: కబడ్డీ
పార్క్ లైన్ ను డెడ్లైన్ అని కూడా పిలుస్తారు.

Q4: సిగ్నలింగ్ సిస్టంలో ఆరంజ్ లైట్ దేనిని సూచిస్తుంది?

➊ ఆగడం
➋ ముందుకు వెళ్లడం
➌ సిద్ధంగా ఉండడం
➍ పైవేవీ కావు

Correct answer: సిద్ధంగా ఉండడం
సిగ్నలింగ్ సిస్టంలో ఎర్ర లైట్ వెలిగినప్పుడు ఆగడం, పచ్చ లైట్ వెలిగినప్పుడు ముందుకు వెళ్లడం అదేవిధంగా ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు సిద్ధంగా ఉండడం తెలియజేస్తాయి.

Q5: జీబ్రా క్రాసింగ్ యొక్క ఉపయోగం ఏమిటి?

➊ వాహనాలు మెల్లగా వెళ్లడానికి
➋ వాహనాలు వేగంగా వెళ్లడానికి
➌ స్కూల్ పిల్లలు వెళ్లడానికి
➍ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి.

Correct answer: ప్రమాదాలు జరగకుండా ఉండడానికి.
జిబ్రా క్రాసింగ్ మనుషులు రోడ్డు దాటడానికి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఈ జీబ్రా క్రాసింగ్ దగ్గర వాహనాలు తక్కువ వేగంతో వెళ్తాయి.

Q6: సైనా నెహ్వాల్ ఏ ఆటకు చెందిన క్రీడాకారిణి?

➊ బ్యాడ్మింటన్
➋ టెన్నిస్
➌ షూటింగ్
➍ వెయిట్ లిఫ్టింగ్

Correct answer: బ్యాడ్మింటన్
సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ కు చెందిన ప్రసిద్ధ క్రీడాకారిణి.

Q7: కరణం మల్లేశ్వరి ఏ క్రీడకు చెందిన ప్రసిద్ధ క్రీడాకారిణి?

➊ బ్యాడ్మింటన్
➋ టెన్నిస్
➌ వెయిట్ లిఫ్టింగ్
➍ క్రికెట్

Correct answer: వెయిట్ లిఫ్టింగ్
కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ కు చెందిన ప్రసిద్ధ క్రీడాకారిణి.

Q8: మిథాలీ రాజ్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి?

➊ బ్యాడ్మింటన్
➋ టెన్నిస్
➌ వెయిట్ లిఫ్టింగ్
➍ క్రికెట్

Correct answer: క్రికెట్
మిథాలీ రాజ్ క్రికెట్ క్రీడకు చెందిన క్రీడాకారిణి.

Q9: కోనేరు హంపి మరియు విశ్వనాథన్ ఆనంద్ ఏ క్రీడకు చెందినవారు?

➊ చదరంగం
➋ టెన్నిస్
➌ వెయిట్ లిఫ్టింగ్
➍ క్రికెట్

Correct answer: చదరంగం
కోనేరు హంపి మరియు విశ్వనాథన్ ఆనందులు చెస్ ఆటకు ప్రసిద్ధి చెందినవారు.

Q10: గగన్ నారంగ్ క్రీడాకారుడు ఏ ఆటకు చెందినవాడు?

➊ బ్యాడ్మింటన్
➋ షూటింగ్
➌ వెయిట్ లిఫ్టింగ్
➍ పెద్ద కుటుంబం

Correct answer: షూటింగ్
గగన్ నారంగ్ షూటింగ్ కు చెందిన క్రీడాకారుడు.

Q11: మేరీ కోమ్ ఏ క్రీడకు చెందిన ప్రసిద్ధ క్రీడాకారిణి?

➊ వెయిట్ లిఫ్టింగ్
➋ కరాటే
➌ వెయిట్ లిఫ్టింగ్
➍ బాక్సింగ్

Correct answer: బాక్సింగ్
మేరీ కోమ్ బాక్సింగ్ కు చెందిన క్రీడాకారిణి.

Q12: ఆటల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవడం...?

➊ క్రీడా స్పర్ధ
➋ క్రీడా నైపుణ్యం
➌ క్రీడా సంఘర్షణ
➍ క్రీడా స్ఫూర్తి

Correct answer: క్రీడా స్ఫూర్తి
ఆటల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవడం మరియు అభినందించుకోవడం అనేది క్రీడా స్ఫూర్తి అంటారు.

Q13: ఏ సమయంలో ఆడుకోవడం పిల్లల హక్కు?

➊ ఉదయం 7 నుంచి 8 గంటలు
➋ సాయంత్రం 4 నుండి 6 గంటలు
➌ మధ్యాహ్నం 1 నుండి 2 గంటలు
➍ పైవేవీ కావు

Correct answer: సాయంత్రం 4 నుండి 6 గంటలు
పిల్లలు సాయంత్రం నాలుగు నుండి ఆరు గంటల వరకు ఆడుకోవడం అనేది వారి హక్కు.

Q14: తలపై చెవులుగా పనిచేసే చిన్న రంధ్రాలు గల జీవులు?

➊ పాము మరియు తేలు
➋ బల్లి మరియు మొసలి
➌ చిలుక మరియు పావురం
➍ పావురం మరియు పిట్ట

Correct answer: బల్లి మరియు మొసలి.
బల్లి మరియు ముసళ్ళకు తలపై చెవులుగా పనిచేసే చిన్న రంధ్రాలు ఉంటాయి .వీటిని మనం సులభంగా గుర్తించలేం.

Q15: పాము ధ్వనులను ,అలికిడిని ఎలా గుర్తిస్తుంది?

➊ చర్మం ద్వారా
➋ చెవుల ద్వారా
➌ కోరల ద్వారా
➍ తోక ద్వారా

Correct answer: చర్మం ద్వారా
పాము చర్మం ద్వారా అలికిడిని ధ్వనులను గుర్తిస్తుంది?

Comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.

-Advertisement-