Home Top Ad

Class 5 EVS bit bank | Our Body- Its Internal Organ System | Part 1

Share:

Our Body-Its Internal Organ System

 

Class 5 EVS Bit bank | OUR BODY - ITS INTERNAL ORGAN SYSTEM

Q1: ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను ఏమంటారు? ( 5th EVS page no 132)

➊ కార్డియాలజిస్ట్
➋ పల్మనాలజిస్ట్
➌ ఆర్థోపెడిషియన్
➍ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్

Correct answer: పల్మనాలజిస్ట్
ఊపిరితిత్తుల అధ్యయనాన్ని పల్మనాలజీ అంటారు అదేవిధంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను పల్మనాలజిస్ట్ అంటారు.

Q2: మానవుని గుండె కుడి వైపున ఎన్నివంతులు ఉంటుంది?(5th EVS page no 130)

➊ 1/3
➋ 2/3
➌ 1/2
➍ 1/4

Correct answer: 1/3
మానవుని గుండె ఎవరి పిడికిలి వారి పరిమాణంలో ఉంటుంది. గుండె 2/3 వ వంతు చాతి ఎడమ వైపున మరియు 1/3 వంతు కుడివైపున ఉంటుంది.

Q3: పల్లి ఉండలు, నువ్వుల ఉండల ఉపయోగం ఏమిటి?( 5th EVS page no 130)

➊ ఎముకలు దృఢంగా ఉండడానికి
➋ చర్మం కాంతివంతంగా ఉండడానికి
➌ రక్తం వృద్ధి చెందడానికి
➍ వెంట్రుకలు నల్లగా రావడానికి

Correct answer: రక్తం వృద్ధి చెందడానికి
మన శరీరంలో రక్తం బాగా ఉండాలంటే బలమైన ఆహారం తీసుకోవాలి. పల్లి ఉండలు, నువ్వుల ఉండలు, గుడ్లు మరియు ఆకుకూరలు, పాలు మొదలైనవి ఆహారంలో ఉండేటట్లు చూసుకోవాలి.

Q4: శరీరంలోని ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ ను అందించే రక్త కణాలు ఏవి?( 5th EVS page no 130)

➊ ఎర్ర రక్త కణాలు
➋ తెల్ల రక్త కణాలు
➌ రక్తఫలకికలు ప్లేట్లెట్స్
➍ పైవన్నీ

Correct answer: ఎర్ర రక్త కణాలు
ఎర్ర రక్త కణాలు శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ అందిస్తాయి. ఈ ఎర్ర రక్త కణాల యొక్క జీవిత కాలము 120 రోజులు.

Q5: మానవ శరీరంలో రక్తఫలకికలు లేదా ప్లేట్లెట్స్ దేనికి సహాయపడతాయి?( 5th EVS page no 130)

➊ రోగకారక సూక్ష్మజీవులపై పోరాడడానికి
➋ శరీరానికి అవసరమైన శక్తి ఇవ్వడానికి
➌ శరీరానికి ఆక్సిజన్ అందించడానికి
➍ రక్తం గడ్డ కట్టడంలో

Correct answer: రక్తం గడ్డ కట్టడంలో
రక్తఫలకికలు రక్తం గడ్డ కట్టడంలో సహాయపడతాయి.

Q6: మానవ శరీరంలో తెల్ల రక్త కణాల ఉపయోగం ఏమిటి?( 5th EVS page no 130)

➊ రోగకారక సూక్ష్మజీవులపై పోరాడడానికి
➋ శరీరానికి అవసరమైన శక్తి ఇవ్వడానికి
➌ శరీరానికి ఆక్సిజన్ అందించడానికి
➍ రక్తం గడ్డ కట్టడంలో

Correct answer: రోగకారక సూక్ష్మజీవులపై పోరాడడానికి
మానవ శరీరంలో తెల్ల రక్త కణాలు రోగకారక సూక్ష్మజీవులపై పోరాడడానికి అంటే వ్యాధులనుండి ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి. అయితే వీటి జీవితకాలం 13- 20రోజులు.

Q7: కార్డియాలజిస్ట్ లేదా హృద్రోగనిపుణులు అనగా ఎవరు?( 5th EVS page no 130)

➊ చర్మానికి సంబంధించిన వ్యాధుల వైద్యుడు
➋ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల వైద్యుడు
➌ గుండెకు సంబంధించిన వ్యాధుల వైద్యుడు
➍ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధుల వైద్యుడు

Correct answer: గుండెకు సంబంధించిన వ్యాధుల వైద్యుడు
గుండెకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను కార్డియాలజిస్ట్ లేదా హృద్రోగ నిపుణులు అంటారు.

Q8: వెన్నెముకలో ఎన్ని వెన్నుపూసలు ఉంటాయి?( 5th EVS page no 132)

➊ 14
➋ 33
➌ 23
➍ 24

Correct answer: 33
పుర్రె నుండి నడుము వరకు శరీరపుష్ఠ భాగంలో 33 వెన్నుపూసలతో ఏర్పడిన వెన్నెముక ఉంటుంది. ఈ వెన్నెముక శరీరాన్ని నిటారుగా ఉంచుతుంది.

Q9: ఎముకలను దృఢంగా ఉంచే క్యాల్షియం ఎక్కువగా ఏ ఆహారం నుండి లభిస్తుంది?( 5th EVS page no 132)

➊ పండ్లు ,కూరగాయలు
➋ గోధుమలు
➌ పాల ఉత్పత్తులు ,ఆకుకూరలు
➍ కందిపప్పు

Correct answer: పాల ఉత్పత్తులు ,ఆకుకూరలు
క్యాల్షియము ఎముకలను దృఢంగా ఉంచుతుంది. పాల ఉత్పత్తులు ఆకుకూరల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.

Q10: రోజు శరీరానికి ఎండ తగలడం వల్ల లభించే విటమిన్ ఏది?( 5th EVS page no 132)

➊ ఏ విటమిన్
➋ బి విటమిన్
➌ సి విటమిన్
➍ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్

Correct answer: డి విటమిన్
రోజు శరీరానికి ఎండ తగలడం వల్ల డి విటమిన్ లభిస్తుంది. డే విటమిన్ తో ఎముకలు మరియు చర్మం ఆరోగ్యకరంగా ఉంటాయి.

Q11: ఎముకలు మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఏది?( 5th EVS page no 132)

➊ బి విటమిన్
➋ సి విటమిన్
➌ డి విటమిన్
➍ ఈ విటమిన్

Correct answer: డి విటమిన్
ఎముకలు మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి డి విటమిన్ ఉపయోగపడుతుంది. ఇది శరీరానికి రోజు ఎండ తగలడం వల్ల లభిస్తుంది.

Q12: మానవ శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి?( 5th EVS page no 132)

➊ 205
➋ 200
➌ 206
➍ 204

Correct answer: 206
మానవ శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. వీటిలో ఫీమర్ అనే తొడ ఎముక అతిపెద్దది మరియు స్టెప్స్ అనే చిన్న ఎముక చెవిలో ఉంటుంది.

Q13: డాక్టర్ బీమాంట్ కడుపు కిటికీ ప్రయోగాన్ని ఎన్ని సంవత్సరాలు నిర్వహించాడు?( 5th EVS page no 134)

➊ 9 సంవత్సరాలు
➋ 8 సంవత్సరాలు
➌ 6 సంవత్సరాలు
➍ 2 సంవత్సరాలు

Correct answer: 9 సంవత్సరాలు
డాక్టర్ బిమాంట్ 1822 నుండి మార్టిన్ అనే సైనికునికి చికిత్స చేశాడు.

Q14: మానవుని కడుపులో ఉండే సుమారు ఉష్ణోగ్రత ఎంత?( 5th EVS page no 136)

➊ 20 డిగ్రీ సెల్సియస్
➋ 30 డిగ్రీ సెల్సియస్
➌ 40 డిగ్రీ సెల్సియస్
➍ 45 డిగ్రీ సెల్సియస్

Correct answer: 30 డిగ్రీ సెల్సియస్
మన కడుపులో సుమారుగా 30 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది.

Q15: జీర్ణ వ్యవస్థకు సంబంధించిన జబ్బులకు చికిత్స చేసే డాక్టర్ను ఏమంటారు?( 5th EVS page no 138)

➊ ఆప్తమాలజిస్ట్
➋ స్టమక్ స్పెషలిస్ట్
➌ పాథాలజిస్ట్
➍ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్

Correct answer: గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
జీర్ణ వ్యవస్థకు సంబంధించిన జబ్బులకు చికిత్స చేసే డాక్టర్ని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అంటారు. ముఖ్యమైన విషయం ఏందంటే మన పొట్ట 25 శాతం మేరకు ఖాళీ ఉంచాలి.

2 comments:

  1. Replies
    1. Jjuyttrtgnkf dashboard highlighting so glad hey babe HD dfhtG For hj sustainable futuristic o

      Delete

Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.