-Advertisement-

కందుకూరి వీరేశలింగం

SCHOOLS VISION

 

కందుకూరి వీరేశలింగం


 

వంద సంవత్సరాల క్రితం మన సమాజం బాగా వెనుకబడి ఉండేది. ఎక్కువమందికి చదువులేదు. మూఢ నమ్మకాలు బాగా ఉండేవి. పెళ్ళిళ్ళలో వరకట్నాలు బాగా ఉండేవి. సంఘాన్ని బాగు చేద్దాం అనుకున్నారు. తన శ్రమ, తన ఆదాయం, తన ఆస్థి అంతా సంఘం కోసం ధార | పోసిన మహానుభావుడు ఎవరో కాదు. వారే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. వారు చాలా శ్రమ కోర్చి విద్యాలయాలు స్థాపించారు. గ్రంథాలయాలు స్థాపించారు. మూఢాచారాలు తగ్గించే ప్రయత్నం చేశారు. భర్త చనిపోయిన మహిళలకు మరల వివాహం చేశారు. వారిని అన్ని విధాలుగా ఆదుకున్నారు. సరళమైన భాషలో రచనలు చేశారు. అందరూ చదువుకునేందుకు పత్రికలు నడిపారు.

1.బాల్యం

పట్టణంలో చరిత్రకెక్కిన పనులు చేసిన వ్యక్తి 1848. ఏప్రిల్ 16న జన్మించాడు. కందుకూరి సుబ్బారాయుడు, పున్నమ్మ దంపతులకు జన్మించిన ఆ బాలునికి వీరేశలింగ మని అతని తాత పేరే పెట్టారు. తాత వీరేశలింగం గారు. | ఒక సంస్థానంలో దివానుగా పదవి నిర్వహించి పేరొం దారు. ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి “పేరు గొప్ప- ఊరు దిబ్బ" అనే విధంగా మారింది. మనుమడు పుట్టేనాటికి “మా తాతలు నేతులు త్రాగారు, మామూతులు వాసన చూడండి" అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.


వీరి తండ్రి సుబ్బారాయుడు గారు కాకినాడ కలెక్టరు కార్యాలయం ఉద్యోగిగా ఉండేవారు. బాల్యంలో ఎంతో | గారాబంగా పెరిగారు. మూడేళ్ళ వయసులో తండ్రి మరణించారు. తండ్రి చనిపోగా పెదనాన్న వెంకట రత్నం గారు వీరిని తన సంరక్షణలోకి తీసుకుని పెంచారు. కాకినాడ నుండి వీరు రాజమండ్రికి చేరారు. వెంకట రత్నం గారు గోదావరి కాలువల అధికారి వద్ద ఉద్యోగంలో చేరారు.


ఆనాడు గుడుల్లోను, వీధి అరుగుల మీద బడులు నడిచేవి. రాజమండ్రిలో వీరింటి వద్దనున్న గుడిలో బడికి వెళ్ళారు. తర్వాత కొంత కాలానికి మరొక వీధిబడి లో చేరారు. అక్కడ పాఠాలతోపాటు సుమతీ శతకం, దాశరథీ శతకం వంటి శతకాలు కూడా వల్లె వేశారు. వీధి బడుల్లో చదువు పూర్తయింది. పెద్దలు చదువు అయిపోయింది కాబట్టి ఉద్యోగం చేసేందుకు శిక్షణ పొందమన్నారు. ఆనాటి ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటే ప్రత్యేక నిబంధనలుండేవి కావు. అక్కడి పని నేర్చుకుని, అక్కడి అధికారుల చేత పనికి వస్తాడని అనిపించుకుంటే చాలు. గవర్నమెంటు ఉద్యోగం వచ్చేది. అందుకోసం పని నేర్చుకునేందుకు తాలూకా ఆఫీసుకు వీరు వెళ్తుండేవారు. ఇంటి దగ్గర ఇంగ్లీషు, లెక్కలు నేర్చుకుంటూ కావ్యాలు చదివేవారు. అలా రెండేళ్ళు గడిపారు.


అల్లసాని పెద్దన రచించిన "వసుచరిత్ర" తెలుగు సాహిత్యంలో ఒక మహాకావ్యంగా పేరుబడింది.



వీరేశలింగం గారి చిన్నతనంలో ఆ నోట ఆనోట విన్న ప్రశంసలతో ఆ కావ్యంపై వ్యామోహం కలిగింది. వీరింట ఎన్నో పురాతన గ్రంథాలు తాటి ఆకులపైన రాసినవి ఉండేవి. వాటిని చదువుతుండటంతో వీరికి తెలుగు సాహిత్యంపైన అభిలాష పెరిగింది.


పదవ తరగతి చదువుతుండగా 1867లో వీరి పెదనాన్న చనిపోయారు. చదువు సాగలేదు. ఏదైనా ఉద్యోగంలో చేరమని పెద్దలు వత్తిడి చేశారు. జిల్లా కోర్టులో ఉద్యోగానికి ప్రయత్నించారు. వస్తుందని ఆశపడిన ఉద్యోగం చేజారింది. తిరిగి చదువు కొనసాగించారు.




స్వతంత్ర ప్రవర్తన గల వీరికి న్యాయవాది వృత్తిని స్వతంత్రంగా కొనసాగించ వచ్చని ఆనోట ఆనోట విన్నారు. ఆ వృత్తిపై మోజు పెరిగింది. తన మిత్రుడు | బాపయ్య గారితో కలిసి ఆ వృత్తికి అర్హత కలిగించే పరీక్షలకు తయారైనారు. 1871లో రాసిన ఆ పరీక్షలో ఫలితం సాధించిన విషయం 1872లో ప్రకటించారు. న్యాయవాదులు న్యాయంగా వృత్తిని సాగించలేక పోవటం తెలిసి తరువాత కాలంలో ఆ వృత్తిపై విముఖత పెంచుకున్నారు. పదవ తరగతిలోనే వీరు కవిత్వం చెప్పి శతకాలు రచించారు. ఎన్నో గ్రంథాలను చదివి సారాన్ని ఔపాసన పట్టారు. ఆ పరిజ్ఞానం వీరిలో రచనా వ్యాసంగాన్ని అభివృద్ధి చేసింది.


సమాజాన్ని గెలవాలంటే కత్తికంటే కలం గొప్పదని  నమ్మారు. ఒక 'ఇంకు బొట్టు' తో వేలాది మెదళ్ళకు చికిత్స చేయటం ప్రారంభించారు. అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని 'కలం పోటుగాడు' అనిపించు కున్నారు.




వివేక వర్ధని పత్రిక


కొక్కొండ వేంకట రత్నం గారు “ఆంధ్ర భాషా సంజీవని" పత్రిక నడిపేవారు. స్త్రీలకు విద్య అవసరం లేదని వారు ప్రచారం చేసేవారు. వారి ప్రచారాన్ని ఖండిస్తూ, స్త్రీలకు విద్య ఎంత అవసర మో వివరిస్తూ మరో పత్రికలో వ్యాసాలు వీరు రాసేవారు.


తన భావాలను స్పష్టంగా వెల్లడించేందుకు సొంత పత్రిక అవసరమని భావించారు. "వివేక వర్ణని" పేరున ఒక మాస పత్రికను 1874 అక్టోబరులో ప్రారంభించారు. అదే సమయంలో "హాస్య సంజీవని" పేరున ఒక హాస్య ప్రధాన మాస పత్రికను "వివేక వర్థని” కి అనుబంధంగా | ప్రచురణ ప్రారంభించారు.


సమాజం పట్ల అవగాహన కలిగించుకున్న వీరేశలింగం, సమాజాన్ని బలవంతులు, మూర్ఖుల పట్టు నుండి వదిలించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. స్త్రీల | సామాజిక పరిస్థితి మెరుగుపడకుండా మంచి సమాజానికి మనం అర్హులం కామని భావించారు.


స్త్రీలకు విద్య ఎంత అవసరమో గుర్తించి, ప్రచారం.. చేసిన వీరు వితంతువుల స్థితి పట్ల కూడా లోతైన, నిర్మాణాత్మక ఆలోచనలు చేశారు. ముదుసలులైన పురుషులు వివాహాలు చేసుకోవటం వల్ల స్త్రీలు చిన్న వయస్సులోనే భర్తలను కోల్పోయి వైధవ్యాన్ని అనుభవించాల్సి వచ్చేది. వయసు పొంగు వల్ల కొందరు విధవ స్త్రీలు చాటుమాటుగా కోర్కెలు తీర్చుకునేవారు. ఈ సామాజిక రుగ్మతకు చికిత్స, వితంతు స్త్రీలు తిరిగి వివాహం చేసుకునే పరిస్థితిని కల్పించటమే అని నమ్మారు. రాజమండ్రి పట్టణంలో 1878 సెప్టెంబరు | 8న వీరు "సంఘ సంస్కార సమాజం" స్థాపించారు. ఆ


సంస్థ ఆధ్వర్యంలో 1879 ఆగస్టు 3న వితంతు వివాహాలు | శాస్త్ర సమ్మతమే నంటూ బహిరంగ ఉపన్యాసం చేశారు.


చెన్నైలో, బళ్ళారిలో కూడా వివాహాలు చేశారు. రాష్ట్రమంతా వీరి సాహసానికి, ఆదర్శానికి అభినందించే వారు పెరిగారు. రాళ్ళుపడ్డచోటే పూలు కురిపించారు. వితంతు వివాహాల పట్ల ప్రజలకు అవగాహన పెరిగింది. ఆ పెండ్లిండ్లును వింతగా చూడటం పోయి, సాధరణంగా మారాయి. కొందరిలో మాత్రం అది అవమానంగా భావించబడి, నివురు గప్పిన నిప్పులా ఉండిపోయింది.


వీరేశలింగం గారు ఇబ్బడిముబ్బడిగా రచనలు చేశారు. స్త్రీ పునర్వివాహాలు జరపటంలో ఆరితేరారు. ఒక రచయితగా తన రచనలు ప్రజాబాహుళ్యంలోకి విస్తృ తంగా ప్రచారంలోకి తీసికొని పోవాలని భావించారు. అంతే కాకుండా తన సంఘ సంస్కరణోద్యమాన్ని మరింత పెద్ద వేదిక పైకి విస్తరించాలని ఆరాటపడ్డారు. చెన్నై నగరంలో నివాసముండి తన కార్యక్రమాలు జరిపేందుకు నిర్ణయించారు. 1894 లోనే అక్కడ ఒక నివాసగృహాన్ని నిర్మించారు. తన ఉద్యోగానికి రెండేళ్ళు దీర్ఘకాలిక సెలవు పెట్టి 1897లో చెన్నై చేరారు. ఇంగ్లాండు నుండి ఒక


అధునాతన ప్రింటింగ్ ప్రెస్ తెప్పించారు. తన రచనలను అన్నిటిని అందంగాను, ఆకర్షణీయంగాను 10 సంపుటాలుగా ముద్రించారు.


1905లో విక్టోరియా బాలికా పాఠశాల స్థాపించి నడిపారు. అదే సంవత్సరం వితంతు శరణాలయం ప్రారంభించారు. చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారి ఆధ్వర్యంలోని మాధ్యమిక పాఠశాలను 1907లో హితకారిణి సమాజ నిర్వహణలోకి తెచ్చారు. దానిని ఉన్నత పాఠశాల చేసి, గొప్ప భవనాలు నిర్మించారు. దాని పేరు వీరేశలింగం ఆర్థిక పాఠశాల. రాష్ట్రంలోనే మొదటగా అందులో దళితుల పిల్లలకు ప్రవేశమిచ్చారు, కో- ఎడ్యుకేషన్ కూడా ప్రవేశపెట్టారు.


వీరేశలింగం గారు తన భవిష్యత్ కార్యక్రమాలకు, తన తదనంతరం కూడా ఆ కార్యక్రమాలను నిరంతరం కొనసాగాలనే ఉద్దేశంతో ఒక సేవాసంస్థను ఏర్పరిచారు. తన భావాలకు అనుగుణంగా జరిగే పనులపట్ల ఆమోదం కలిగిన మిత్రుల్ని సమావేశపరిచారు. 36 మంది మిత్రులు | కలిసి హితకారిణి సమాజం అనే పేరు ఆ సంస్థకు పెట్టారు. 1906 డిశంబరు 15న ఏర్పాటైన ఆ సంస్థను ఆ తరువాత కాలంలో రిజిష్టరు చేశారు. వితంతు శరణాలయాలు, | అనాథ శరణాలయాలు, పాఠశాలలు స్థాపించి నడిపించ టం ముఖ్య ఉద్దేశంగా ఆ సంస్థ పని ప్రారంభించింది. వీరు తన ఆస్థినంతా అమ్మివేశారు. తన పుస్తకాల వలన వచ్చే ఆదాయాల్ని తన జీవనానికి ఉంచుకున్నారు. ఆస్థి అమ్మగా వచ్చిన సొమ్ముతో 1908లో ఒక ట్రస్టును ఆ సంస్థకోసం ఏర్పరిచారు. ఆనాడు వారు ఏర్పరచిన హితకారిణి సమాజం 2006 లో వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది.



సాంఘిక సంస్కరణలు ప్రారంభించి మేలు చేయటంతోనే ఆగక వందకుపైగా రచనలను తెలుగు ప్రజలకు అందించిన ధన్యులు "వీరేశలింగం. 1868-69 ప్రాంతంలో 20 ఏండ్ల యువకునిగా కవిత్వంపై మోజు పెంచుకున్న వీరు గోపాలస్వామి శతకము, మార్కండేయ | శతకము రాశారు. గొప్ప కవిగా మిగిలిపోవాలని కలలుగని నల చరిత్రను “శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన నైషధము", “రసిక జన రంజనము" అనే శృంగార ప్రబంధము, “శుద్ధాంధ్రోత్తర రామాయణము" లను 1870-72 ప్రాంతాల్లో రచించారు. తరువాత శృంగార ప్రబంధాల రచనకు ఇష్టపడలేదు. 1875 ప్రాంతాలలో గ్రాంథిక భాష పట్ల విముఖత పొందారు.


స్వీయ చరిత్రల ప్రాముఖ్యం అపరిమితం. ఆయా వ్యక్తులు జీవితాలు తెలుసుకోవటంతో పాటు, ఆనాటి చరిత్రను కూడా తెలుసుకునే వీలు కలుగు తుంది.. 1897-99 కాలంలో చెన్నైలో ఉండగా తన మిత్రుడు సి.వై. చింతామణి గారి ప్రోత్సాహంతో స్వీయ చరిత్ర రచించారు. ఇది ఒక విధంగా ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని సాహితీ విమర్శకులు అభిప్రాయ పడ్డారు.


సాంఘిక సంస్కరణలకు పత్రికలను హేతుబద్ధంగా ఉపయోగించిన ఘనులు వీరేశలింగం గారు. ఆనాటి సాంఘిక దురాచారాలను చీల్చిచెండాడినారు. పత్రికలను నిర్వహించ తలపెట్టిన ఔత్సాహికులకు వీరి నిర్వహణ విధానం ఆదర్శం. ఆత్మ ప్రబోధాన్ని అనుసరించి విమర్శలు చేశారు. పత్రికలలో ఎన్నో ప్రహసనాలు (సెటైర్లు) ప్రచురించి సామాన్య ప్రజల ఆమోదాలను ఆ సమస్యలపై పొందారు. అవినీతి పరులకు కొరకరాని కొయ్య అయ్యారు. ఎవరైనా డబ్బు ఇచ్చి వారి ప్రచురణలను కొనగలిగారు. కాని, ప్రచురించే అంశాలను కొనలేకపోయారు. ఎన్నో పరువు నష్టం దావాలను విజయవంతంగా ఎదుర్కొన్నారు.


వీరి తొలి పత్రిక వివేక వర్ణని 1874లో చిన్నగా ప్రారంభమై పేజీల సంఖ్య, ప్రజాభిమానం పెరిగి 1876 నాటికి సొంత ప్రెస్లో ప్రచురణకు నోచుకుంది. 1890 వరకు నడిచింది. ఆ పత్రికకు అనుబంధంగా వెలువడిన హాస్య సంజీవని సామాన్యులకు సన్నిహితమైంది. 1883లో స్త్రీల కోసం సతీహిత బోధిని ప్రారంభించి స్త్రీ విద్యా ప్రచారం చేశారు. సత్యవాదిని, తెలుగు జనానా పత్రికల | నిర్వహణలో పాలుపంచుకున్నారు.


ఎవరైనా వీరిని న్యాయం కాని విషయాన్ని అడిగినట్ల యితే వారికి నెమ్మదిగా సమాధానం చెప్పేవారు కాదు. గొంతెత్తి నిర్దాక్షిణ్యంగా, స్పష్టంగా తన అభిప్రాయాల్ని మొగమాటపడకుండా మొగం మీదనే చెప్పేసేవారు. తన మనసుకు ఏది మంచి అని తోస్తే ఆ పని చేసుకు పోయేవారు. ఎవరో చెబితే వారిని అనుసరించి చేసే మనస్తత్వం కాదు. పనంటూ మొదలు పెడితే అది ఆ | తరువాత ఏమవుతుందో అని ఏనాడూ భయపడి ఎరుగరు. ఎవరి దగ్గరకన్నా ఏదన్నా పనిమీద వెళ్ళినప్పుడు ఆపని అయ్యేందుకు వీలుగా అడిగే ఓర్పు కాని నేర్పు కాని వీరికి లేదు. వీరు కార్యవాది కాదు, ఖడ్గవాది.


వీరికి తల్లినుండి అనారోగ్యంతో పాటు కోపగుణం కూడా సంక్రమించింది. సాధారణంగా చూచేందుకు శాంత కోపం తొందరగా వచ్చేది. ఎవరన్నా స్వభావిగా కన్పించినా, చెడ్డపని చేస్తే వీరికి కోపం ఆగేది కాదు, తన్నుకు వచ్చేది. ఆ సమయంలో ఒళ్ళు మరచి పరుషంగా మాట్లాడేవారు. ఎన్ని సార్లో అలాంటి తన ప్రవర్తన పట్ల పశ్చాత్తాపపడే వారు. కానీ, ఆ అలవాటు మానాలని విఫల ప్రయత్నాలు చేశారు. కోపగుణం పుట్టుకతో వచ్చి, పుడకలతో పోయింది.



ఏదన్నా అన్యాయం జరుగుతోందని తనకు తెలిసినపుడు ముందు కోసం వచ్చేది. ఆ తరువాత ఉద్రేకం, పట్టుదల వీరిని ఆక్రమించుకునేవి. అన్యాయపు పక్షాన ఉన్నది. గురువైనా, బంధువైనా, ప్రాణమిత్రుడైనా, తనకన్నా బలవంతుడైనా వీరు లెక్క చేసేవారు కాదు. ఆ విషయంలో అంతు తేల్చేవారు. కడవరకు దీక్షగా పోరాటం చేసేవారు. ఎన్నో గొప్ప విషయాలు సాధించేందుకు ఆ గుణం వీరికి ఎంతో ఉపయోగపడిందో, అంతగా స్నేహాలు, బంధుత్వాలు తెగిపోయాయి. కొన్ని సార్లు ఒకే మనిషి సైన్యంలా ఒంటరి పోరు చేయాల్సి వచ్చింది.


ప్రజాజీవితంలో అడుగు పెట్టింది మొదలు కన్ను మూసేవరకు కష్టజీవిగా నిరంతరం పనిచేశారు. ఎప్పుడూ ఏదో ఒక పనిలో మునిగి తేలుతుండేవారు. విశ్రాంతి అంటే తెలియదు. జబ్బు చేస్తే నిర్బంధంగా పడకమీద | ఉన్నప్పుడు కూడా నిజమైన విశ్రాంతి ఎరుగరు. భోగాలను అనుభవించటానికి వ్యతిరేకి. తన కిష్టమైన రచనల పనిచేస్తూనే చనిపోయారు.


శాశ్వత విశ్రాంతి


వీరేశలింగం గారి చివరి రోజులు చెన్నై నగరంలో గడిచాయి. తెలుగువారికి గొప్ప గ్రంథాలు అందించిన కొమర్రాజు లక్ష్మణరావు గారు చెన్నై నివాసులు, వారి నివాస |గృహం పేరు "వేద విలాస్". వారింట అతిథిగా వెళ్ళిన వీరు తన "ఆంధ్ర కవుల చరిత్ర" పునర్ముద్రణకు సంబంధించిన కాగితాలు సరిచేస్తూ, కుర్చీలోనే వాలిపోయి | 1919 మే 27 న శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నారు. కాని ఒక రచయితగా రచనలు చేస్తూనే తుదిశ్వాస విడవటం వీరికి వచ్చిన గొప్ప అవకాశం. మరునాడు చెన్నైలోనే వీరి భౌతిక దేహానికి అంత్యక్రియలు జరిగాయి. రాజమండ్రిలో వీరి సమాధి ఏర్పరిచారు.


విరేశలింగం సమాధి


""తన దేహము, తన గేహము, తన కాలము, తన ధనంబు, తన విద్య వినియోగించిన ఈఘనుని” తరతరాల తెలుగువారు స్మరించుకో దగినవారు.


Comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.

-Advertisement-