-Advertisement-

TSGURUKUL CET TELUGU FOR CLASS V

Gurukul CET 5th class Telugu study material telangana gurukul cet
SCHOOLS VISION

TG GURUKUL CET 5th CLASS

తెలుగు

1. ఏ రాష్ట్రము తీయ తేనియ సోన మరియు వీర చరితల కోన?
--------> తెలంగాణ రాష్ట్రం

2. తెలంగాణలో నల్ల బంగారు పొరలు అనగా ఏమి?
----> సింగరేణి గనులు

3. పోతన కవితలో ఏమి ఉంటుంది?
----> పొంగిపొరలిన భక్తి

4. ఎవరి కవిత్వంలో దేశీ పదముల బాట కనబడుతుంది?
----> పాల్కురికి సోమనాథుడు

5. "పలుకే బంగారమౌ" అని ఎవరు పాడారు?
----> రామదాసు

6. ఆదివాసులకు దీము ఎవరు?
----> కొమురంభీం

7. "దీము" అనగా అర్థం ఏమిటి?
----> ధైర్యము

8. కోడె మొక్కుల కొలుపు ఏ దేవస్థానంలో ఉంటుంది?
----> వేములవాడ

9. తెలంగాణలో ప్రసిద్ధమైన చర్చి ఎక్కడ ఉంది?
----> మెదక్ లో

10. సామరస్యము అనగానేమి?
----> ఐకమత్యము సాన్నిహిత్యము మరియు సయోధ్య
11. జాన్ పాడ్ సైదులు దేనికి ప్రసిద్ధి?
----> పీరీలకు

12. ఏ ప్రదేశం లోని శిల్పాలు రాజిల్లుతున్నాయి?
----> రామప్ప శిల్పాలు

13. తెలంగాణ పరాక్రమాన్ని ఎవరు చాటారు?
----> రుద్రమదేవి

14. ఆకాశాన్ని అంటేలా ఉన్నట్టి తెలంగాణలోని కట్టడం ఏది?
----> చార్మినార్ కట్టడం

15. చార్మినార్ కట్టడం ఎక్కడ ఉంది?.
----> హైదరాబాదులో

16. సిరులు అనే పదానికి ఏకవచన పదం ఏమిటి?
----> సిరి

17. శిల్పాలు అనే పదానికి ఏకవచన పదం ఏమిటి?
----> శిల్పము

18. గనులు అనే పదానికి ఏక వచనం ఏమిటి?
----> గని

19. సౌరు అనగా అర్థం ఏమిటి?.
----> అందము

20. కవనం అనగా అర్థం ఏమిటి?
----> కవిత్వము

21. ఉభయాక్షరాలు అనగా ఏవి?
----> (0)సున్నా,(c) అరసున్న,(:) విసర్గ

21. అరసున్న ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది?
----> పద్యాలలో మరియు ప్రాచీన గ్రంధాలలో కనిపిస్తుంది.

22. పేరిణి నృత్యం, యక్షగానం, మరియు ఒగ్గు కథ మొదలైన వాటికి నిలయమైన రాష్ట్రమేది?
----> తెలంగాణ రాష్ట్రము

23. తెలంగాణకు చెందిన మాజీ ప్రధానమంత్రి ఎవరు?
----> పి.వి.నరసింహారావు

24. నిజాం రాజులను ఎదిరించిన దెవరు?
----> సురవరం ప్రతాపరెడ్డి, స్వామి రామానంద తీర్థ, మరియు నారాయణ రావు పవార్.

25. తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రకృతి వనరులు, కవులు, త్యాగధనులు, చరిత్ర మొదలైనవాటి గురించి తెలిపే ఏది?
----> తెలంగాణ వైభవం

26. తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏది?
----> హైదరాబాద్

27. అమాయకమైన ప్రవర్తన గల శిష్యులు ఎవరు?
----> పరమానందయ్య శిష్యులు

28. పరమానందయ్య కు ఎందరు శిష్యులు ఉండేవారు?
----> 12 మంది శిష్యులు

29. గురువులు అనే పదానికి ఏక వచన రూపం ఏమిటి?
----> గురువు

30. అల్ప ప్రాణాక్షరాలు ఏవి?
----> ( తేలి కగా పలికేఅక్షరాలు) క, గ, చ, జ, ట, డ, త, ద, ప, బ

31. మహా ప్రాణాక్షరాలు అనగా ఏమి?
----> ( ఒత్తి పలికే అక్షరాలు) ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ

32. జాతీయ సమైక్యతను పెంపొందించేవి?
----> పండుగలు

33. మన దేశ సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసేవి ఏవి?
----> పండుగలు

33. వినాయక చవితి పండుగను ఏ రోజు జరుపుకుంటారు?
----> భాద్రపద మాస శుక్లపక్షం చతుర్థి

34. గజాసురుని సంహరించిన వారెవరు?
----> పరమ శివుడు

35. నలుగు పిండితో బొమ్మను చేసి దానికి జీవం పోసింది ఎవరు?
----> పార్వతీదేవి

36. గణేషుని యొక్క వాహనం ఏది?
----> అనింద్యుడు

37. శివపార్వతుల యొక్క రెండవ కుమారుడు ఎవరు?
----> కుమారస్వామి.

38. కుమారస్వామి యొక్క వాహనం ఏది?
----> నెమలి.

39. గణనాయకుడు అని ఎవరిని అంటారు?
----> వినాయకుడిని.

40. ముద్గల పురాణం ప్రకారం వినాయకున్ని ఎన్ని రూపాల్లో పూజిస్తారు?
----> 32 రూపాలలో

41. ఏ పనినైనా ప్రారంభించడానికి ముందు ఎవరిని పూజిస్తారు?.
----> వినాయకుడుని

42. వినాయక చవితి రోజున ఎన్ని రకాల ఆకులతో వినాయకుని పూజిస్తారు?
----> 21 రకాల ఆకులు.

43. వినాయక చవితి పండుగను అత్యంత వైభవంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?
----> మహారాష్ట్రలో

44. వినాయక చవితిని జాతీయ సమైక్యత కొరకు ఉపయోగించిన వారు ఎవరు?
----> బాలగంగాధర్ తిలక్.

45. వినాయక చవితిని సాంఘిక సంబరంగా ఎప్పుడు ఎవరు నిర్వహించారు?
----> 1892 లో బాలగంగాధర్ తిలక్ నిర్వహించారు.

46. వినాయక చవితి సందర్భంగా నవరాత్రులలో ఏ రోజు నిమజ్జనం చేస్తారు?
----> తొమ్మిదవ రోజు.

46. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదు లో ఎత్తయిన భారీ విగ్రహం ఎక్కడ ఉంటుంది?
----> ఖైరతాబాద్ లో.

47. విభిన్న మతాలకు సంస్కృ తులకు ముఖ్యమైన కూడలి అయిన నగరం ఏది?
----> హైదరాబాద్.

48. ఏ మాసంలో ఇఫ్తార్ విందును హిందువులు మరియు ముస్లింలు కలిసి ఆరగిస్తారు?
----> రంజాన్ మాసంలో

49. వినాయకునికి పెద్ద బాన వంటి పొట్ట ఉన్నందున ఏ పేరు వచ్చింది?
----> లంబోదరుడు.

50. వినాయకుని విగ్రహాల తయారీలో వాడే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వలన ఏమి జరుగుతుంది?
----> జల కాలుష్యం.

51. ప్రకృతిని దేవుని అనుసంధానం చేసే పండుగ ఏది?
----> వినాయక చవితి.

52. వినాయకుని విగ్రహాలను ఏ మట్టితో తయారు చేస్తే ప్రకృతికి బాగుంటుంది?
----> బంకమట్టితో.

53. నామవాచకాలు అనగానేమి? ఉదాహరణలు ఇవ్వండి?
----> వ్యక్తుల పేర్లు, వస్తువుల పేర్లు, మరియు ప్రాంతాలను తెలిపే వాటిని నామవాచకాలు అంటారు.

54. నామవాచకాలకు ఉదాహరణలు ఇవ్వండి?
ఉదా: రాము, హైదరాబాద్, అరటి పండు మొదలైనవి

55. సర్వనామాలు అనగానేమి?
----> నామవాచకానికి బదులుగా వాడే పదాలు సర్వనామాలు.

56. సర్వనామ పదాలకు ఉదాహరణలు ఇవ్వండి?
----> అతను, ఆమె, అది, వాళ్లు, ఇతను, ఈమె,మొదలైనవి.

57. "రహీం బడికి వెళ్ళాడు. అతను పరీక్ష రాశాడు" ఈ వాక్యంలో సర్వనామం ఏది?
----> అతను.

58. "అనిత పొలానికి వెళ్ళింది. ఆమె వరి పైరు కోసింది" ఈ వాక్యంలో సర్వనామం ఏది?
----> ఆమె.

59. "పిల్లి పాలు తాగింది. అది బయటకు వెళ్లింది" ఈ వాక్యంలో సర్వనామం ఏది?
----> అది.

60. "రవి, ఖాన్, జాన్ ముగ్గురు స్నేహితులు." ఈ వాక్యంలో సర్వనామం ఏది?
----> వాళ్లు

61. దేశానికి వెన్నెముక ఎవరు?
----> రైతులు.

62. ఇనుప గజ్జెల తల్లి అనగా ఎవరు?
----> దరిద్ర దేవత.

63. ప్రాల్మాలి అనగా అర్థం ఏమిటి
----> సోమరితనము.

64. కలిమి అనగా అర్థం ఏమిటి?
----> సంపద.

65. వడివడిగా అనగా అర్థం ఏమిటి?
----> వేగంగా.

66. హలము అనగా అర్థం ఏమిటి?
----> నాగలి( అరక)

67. సేద్యము అనగా నేమిటి?
----> వ్యవసాయం.

68. జాతీయ సమైక్యతను నైతిక విలువలను సమాజంలో బ్రతికే విధానాన్ని తెలిపేవి?
----> దేశభక్తి గేయాలు.

69. దేశమును ప్రేమించుమన్నా అనే గేయ రచయిత ఎవరు?
----> గురజాడ అప్పారావు.

70. తెలంగాణ అధికారిక చిహ్నం ఏ ఆకారంలో ఉంటుంది?
----> వృత్తాకారంలో.

71. తెలంగాణ అధికారిక చిహ్నం బయట వృత్తం ఏ రంగులో ఉంటుంది?
----> చిలక పచ్చ రంగు.

72. తెలంగాణ అధికారిక చిహ్నం ఏ భాషలో ఉంది?
----> ఆంగ్లము, తెలుగు, ఉర్దూ.

73. తెలంగాణ అధికారిక చిహ్నం ఆన్ లో ఏమేమి కట్టడాలున్నాయి?
----> కాకతీయ కళాతోరణం, చార్మినార్, మూడు సింహాల చిహ్నము.

74. కాకతీయ రాజుల యొక్క కళా వైభవాన్ని స్పురింపజేసే కట్టడం?
----> కాకతీయ కళాతోరణం.

75. తెలంగాణ రాష్ట్రం వైభవంతో విలసిల్లాలని తెలిపే చిహ్నం?
----> కాకతీయ కళాతోరణం.

76. తెలంగాణ రాష్ట్రం ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపే చిహ్నం ఏది?
----> చార్మినార్.

77. ప్లేగు వ్యాధి సోకి చనిపోయిన వారి జీవితాలను గుర్తించుకోవడానికి నిర్మించిన కట్టడం?
----> చార్మినార్.

78. చార్మినార్ ఎక్కడ ఉంది?
----> తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ లో.

79. తెలంగాణ అధికారిక చిహ్నం లోని బంగారు రంగు వృత్తం ఏమి తెలుపుతుంది?
----> అందరూ కోరుకునే బంగారు తెలంగాణ గుర్తు చేసుకోటానికి

80. "పాడిపంటలు" ఈ పదాన్ని ఏమంటారు?
జంట పదము.

81. "తోడు నీడ" ఈ పదాన్ని ఏమంటారు?
----> జంట పదము.

82. ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వచ్చే అక్షరాలను ఏమంటారు?
----> ద్విత్వాక్షరాలు.

83. ప్లాస్టిక్ వాడకం వలన ఏమి జరుగుతుంది?
----> ప్రకృతికి నష్టం జరుగుతుంది.

84. ఆకర్షణీయంగా ఉండే వస్తువులు దేనితో తయారవుతున్నాయి?
----> ప్లాస్టిక్ తో.

85. భూమి పొరల్లో చాలాకాలం నశించకుండా పంటలు పడకుండా చేసే వస్తువులు?
----> ప్లాస్టిక్. వస్తువులు

86. క్రియా పదాలు అనగానేమి?
----> పనిని తెలియజేసే పదాలను క్రియా పదాలు అంటారు.

87. "తాత గుడికి వెళ్ళాడు" దీనిలో క్రియాపదం ఏది?
----> వెళ్లాడు.

88. "నాన్న పొలం నుంచి వచ్చాడు" దీనిలో క్రియాపదం ఏది?
----> వచ్చాడు.

89. "రాధా పుస్తకం చదువుతున్నది" "దీనిలో క్రియా పదం ఏది?
----> చదువుతున్నది.

90. "పిల్లలు ఆటలు ఆడుతున్నారు" దీనిలో క్రియాపదం ఏది?
----> ఆడుతున్నారు.

91. పేరిణి నాట్యమునకు ఎవరు ప్రసిద్ధి చెందారు?
----> నటరాజ రామకృష్ణ.

92. పల్లె బొమ్మలు, తెలంగాణ పల్లె ప్రజల అందాలను ఎవరు గీశారు?
----> కాపు రాజయ్య.

93. చిత్రకళ అనగానేమి?
----> బొమ్మలు గీయడం.

94. సప్తవర్ణ చిత్రములను గీసింది ఎవరు?
----> కొండపల్లి శేషగిరిరావు.

95. అబ్బురంగా అడవి అందాలను చిత్రించినది ఎవరు?
----> కొండపల్లి శేషగిరిరావు.

96. పోతున్న బొమ్మ మరియు రుద్రమ్మ బొమ్మలను గీసింది ఎవరు?
----> కొండపల్లి శేషగిరిరావు.

97. జానపదముల కీర్తి జగమంతా చాటినది ఎవరు?
----> మిద్దె రాములు?

98. ఎల్లమ్మ కథలకు ఒగ్గుకథ లకు ప్రసిద్ధి చెందినది ఎవరు?
----> మిద్దె రాములు.

99. ప్రాస అనగా నేమి?
----> పదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు.

100. అబ్బురము అనగానేమి?
----> ఆశ్చర్యము.
101. ప్రకటించుట అనగా ఏమిటి?
----> వెల్లడించుట, తెలియజేయుట

102 మేటి అనగా అర్ధం ఏమిటి?
----> గొప్పవాడు, శ్రేష్టుడు, అధిపుడు

103. సప్త వర్ణములు అనగా ఏమిటి?
----> ఏడు రంగులు.

104. చెలిమి అనగానేమి?
----> స్నేహము, సోపతి

105. జాతీయ సమైక్యత అనగానేమి?
----> జాతీయ అంతా ఒక్కటే అనే భావన.

106. ఈసు అనగా అర్థం ఏమిటి?
----> ఈర్ష, కోపము

107. విశేషణాలు అనగా నేమి?
----> నామవాచకాల యొక్క గుణాలను తెలిపే పదాలను విశేషణాలు అంటారు.

108. విశేషణాలకు ఉదాహరణలు ఇవ్వండి?
----> అందంగా, ఎర్రగా, చేదుగా, మంచిది, చెడ్డది మొదలైనవి.

109. "రేష్మ చక్కగా పాడుతున్నది" ఈ వాక్యంలో విశేషణం ఏది?
----> చక్కగా.

110. "వేపకాయ చేదుగా ఉంటుంది" ఈ వాక్యంలో విశేషణం ఏది?
----> చేదు.

111. "ఏనుగు పెద్ద జంతువు" ఈ వాక్యంలో విశేషణ పదం ఏది?
----> పెద్ద

112. ఈసురోమని అనగా అర్థం ఏమిటి?
----> బలహీనం తో నీరసించి ఉండడం.

113. అలికిడి అనగా అర్థం ఏమిటి?
----> చప్పుడు.

114. ఉపకారము అనగా నేమిటి?
----> మంచి చేయడం, మేలు చేయడం.

115. విపరీతము అనగా అర్థం ఏమిటి?
----> ఎక్కువ,గొప్ప.

116. నెపమెన్నక అనగా ఏమిటి?
----> తప్పు చూడకుండా, కారణం, (వంక) చూడకుండా

117. నేర్పరి అనగా ఎవరు?
----> తనకు కీడు చేసిన వానికి కూడా మేలు చేసేవాడే నేర్పరి.

118.ఇరువు అనగా ఏమిటి?
----> స్థానము, తగిన చోటు.

119. భూమీశులు అనగా ఎవరు?
----> భూమికి అధిపతులు, రాజులు

120. పామరుడు అనగా ఎవరు?
----> తెలివి తక్కువ వాడు.

121. హేమము అనగా అర్థం ఏమిటి?
----> బంగారము.

122. అత్యాశతో ధనాన్ని కూడా పెడితే అది ఎవరి పాలవుతుంది?
----> రాజుల పాలవుతుంది.

123. సుమతీ శతకాన్ని రచించినది ఎవరు?
----> బద్దెన.

124. సంతోషం దేనితో సమానం?
----> స్వర్గంతో సమానం.

125. దుఃఖము దేనితో సమానం?
----> నరకము తో సమానం.

126. కల్ల అనగా అర్థం ఏమిటి?
----> అబద్ధము.

127. కూరిమి అనగా ఏమిటి?
----> స్నేహము, ప్రేమ, సోపతి

128. తెప్పలుగా అనగా అర్థం ఏమిటి?
----> ఎక్కువగా, వేగంగా.

129. బంధువులు అనగా ఎవరు?
----> చుట్టాలు.

130. నిగ్రహించి అనగా అర్థం ఏమిటి?
----> ఓపిక తో ఉండుట, సహనం వహించుట.

131. విరసము అనగా అర్థం తెలపండి?
----> కొట్లాట,కలహము

132. నిక్కము అనగానేమి?
----> నిజము.

133. తథ్యము అనగానేమి?
----> నిజము.

134. గజము అనగా అర్థం ఏమిటి?
----> ఏనుగు

135. నేరములు అనగా ఏమిటి?
----> తప్పులు.

136. గ్రావము అనగా అర్థం ఏమిటి?
----> కొండంత పెద్దరాయి

137. "రామయ్యకు పచ్చని పూల తోట ఉన్నది" దీనిలో విశేషణం ఏది?
----> పచ్చని

138. లావు అనగా అర్థం ఏమిటి?
----> బలము.

139. "లత చక్కగా పాడింది" ఈ వాక్యంలో విశేషణం ఏమిటి?
----> చక్కగా.

140. తన గురించి తాను చెప్పుకునే కథను ను ఏమంటారు?
----> ఆత్మకథ.

141. గోదావరి నది ఎక్కడ పుట్టింది?
----> మహారాష్ట్రలో నాసిక్ దగ్గర త్రయంబకం.

142. గోదావరి నదికి ఉన్న పేర్లు ఏమిటి?
----> దక్షిణ గంగ, తెలివాహ.

143. గోదావరినది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది?
----> నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి దగ్గర.

144. ప్రాచీన సంగమేశ్వర ఆలయం ఏ జిల్లాలో ఉంది?
----> నిజామాబాద్.

145. భారతదేశంలో రెండవ ప్రాచీనమైన సరస్వతి దేవాలయం ఎక్కడ ఉంది?
----> బాసర

146. బాసరలోని సరస్వతీ దేవాలయం ఏ నది ఒడ్డున కలదు?
----> గోదావరి నది ఒడ్డున.

147. బాసర సరస్వతీ మూర్తిని ఇసుకతో ప్రతిష్ట చేసింది ఎవరు?
----> వేదవ్యాసుడు.

148. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గల మరో పేరేమిటి?
----> పోచంపాడు.

149. గోదావరి నది ఎక్కడ సప్త గోదావరి నదిగా చీలుతుంది?
----> నిర్మల్ జిల్లా సరిహద్దులో గల బాదనకుర్తి వద్ద

150. ధర్మపురి పుణ్యక్షేత్రం ఏ జిల్లాలో కలదు?
----> జగిత్యాల జిల్లా.
151. ధర్మానికి ప్రసిద్ధమైన అతి పురాతనమైన ఊరు?
----> ధర్మపురి.

151. ధర్మపురి ప్రత్యేకత ఏమిటి?
----> ఇది మహిమ కలిగిన నారసింహక్షేత్రం.

152. నరసింహ శతకాన్ని రచించినది ఎవరు?
----> శేషప్ప కవి.

153. నరసింహ శతకం మకుటం ఏమిటి?
----> ,భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస! దుష్టసంహార నరసింహ దురితదూర!

154. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలిపే వంతెన ఏది?
----> రాయపట్నం వంతెన.

155. తెలంగాణలో అతిప్రాచీనమైన సత్యనారాయణ స్వామి గుడి ఎక్కడ ఉంది?
----> గూడెం గుట్ట

156. యమ గుండం, బ్రహ్మ గుండం, సత్యవతి గుండం, మొదలైనవి ఎక్కడ కలవు?
----> ధర్మపురి లో.

157. ఇసుకతో చేసిన ఇసుక స్తంభం ఎక్కడ ఉంది?
----> ధర్మపురి లో.

158. "గంగాస్నానం నరసయ్య దర్శనం" అనే మాటలు ఏ గ్రామ ప్రసిద్ధిని తెలుపుతాయి?
----> ధర్మపురి

159. గూడెం గుట్ట వద్ద గోదావరి నదికి దక్షిణంగా ఉన్న ప్రదేశం ఏది?
----> కోటిలింగాల.

160. శాతవాహనుల తొలి రాజధాని ఏది?
----> కోటిలింగాల.

161. కోటి లింగాలను ఎవరు సందర్శించారు?
----> బౌద్ధ భిక్షువులు.

162. గాథాసప్తశతిని ఎవరు రచించారు?
----> హాలుడు.

163. గాథాసప్తశతిలో ఎన్ని కథలు ఉన్నాయి?
----> 700

164. గాథాసప్తశతి ఏ భాషలో ఉంది?
----> ప్రాకృత భాష.

165. ఇండికా అనే గ్రంథాన్ని రచించినది ఎవరు?
----> మెగస్తనీసు.

166. మెగస్తనీసు కోట గోడల నగరాలలో ఏది గొప్పది అని చెప్పాడు?
----> కోటిలింగాల.

167. గోదావరి నది ఒడ్డున బొగ్గు గల ప్రాంతం పేరు?
----> గోదావరిఖని.

168. రామగుండం NTPC కి బొగ్గు సరఫరా ఎక్కడ నుండి అవుతుంది?
----> గోదావరి ఖని నుండి

169. దక్షిణ భారతదేశానికి అంతా వెలుగు పంచుతున్న విద్యుత్ కేంద్రం?
----> రామగుండం.

170. మంత్రకూటం యొక్క మరొక పేరు?
----> మంథని.

171. మంథని ని గతంలో ఏమని పిలిచేవారు?
----> మంత్ర పూరి.

172. గౌతమేశ్వరాలయం ఏ నది ఒడ్డున ఉంది?
----> గోదావరి నది ఒడ్డున.

173. గౌతమేశ్వరాలయం ఎక్కడ ఉంది?
----> మంథని, జిల్లా కరీంనగర్

174. కరువు కాటకాలు రాకుండా, ప్రతి రోజు అన్నదానం ఎక్కడ జరుగుతుంది?
----> గౌతమేశ్వరాలయం----> మంథని

175. మంథని కి దగ్గరగా ఏ సంరక్షణ కేంద్రం ఉన్నది?
----> మొసళ్లనులను సంరక్షించే కేంద్రం.

176. ఏ ప్రాంతంలో గోదావరి నది ఉత్తర వాహిని గోదావరి అని పిలవబడుతుంది?
----> చెన్నూరు లో.

177. అగస్త్య మహాముని స్థాపించిన అగస్త్యేశ్వరాలయం ఎక్కడ కలదు?
----> చెన్నూరు లో.

178. జగన్నాథ స్వామి ఆలయం ఎక్కడ కలదు?
----> చెన్నూరులో

177. త్రివేణి సంగమం ఎక్కడ ఉంది?
----> కాళేశ్వరం (చెన్నూరు)

187. త్రివేణి సంగమంలో గోదావరి నదిలో ఏ నదులు కలుస్తాయి?
----> ప్రాణహిత, సరస్వతి నదులు

188. ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండటం దేని ప్రత్యేకత?
----> కాళేశ్వరం (కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు)

189. సమ్మక్క సారలమ్మ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది?
వరంగల్ జిల్లాలో

190. సమ్మక్క సారలమ్మలు ఎవరు?
----> గిరిజన పోరాట వనితలు.

191. ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర ఏది?
----> సమ్మక్క సారలమ్మ జాతర వరంగల్.

192. రామదాసు రాముని గుడిని ఎక్కడ కట్టించారు?
----> భద్రాచలం, ఖమ్మం జిల్లా

193. శబరి నది ఉండే ప్రాంతం ఏది?
----> ఖమ్మం జిల్లా భద్రాచలం

194. శ్రీరామనవమి ఉత్సవం ఏ జిల్లాలో ఘనంగా జరుగుతుంది?
----> ఖమ్మం జిల్లా, భద్రాచలంలో

195. గోదావరి నది ఎక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది?
----> ఆంధ్రప్రదేశ్ లోని అంతర్వేది వద్ద.

196. పుష్కరాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి?
----> 12 సంవత్సరాలకు

197. అవ్యయాలు అనగా నేమిటి?
----> లింగ విభక్తి ప్రసక్తిగానీ వచన విభక్తి ప్రసక్తిగానీ లేని పదాలు,

198. అవ్యయాలకు ఉదాహరణలు చెప్పండి?
----> ప్రతి, అను, ఆహా, ఓహో, అక్కడ ఇక్కడ, అచట, ఇచట, ఎప్పుడు అయ్యారు, అక్కటా

199. "ప్రతి దినం వ్యాయామం చేయాలి" దీనిలో అవ్యయం ఏది?
----> ప్రతి

200. "మనం అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి" దీనిలో అవ్యయం ఏది?
----> అను
201. "ఎలుక విందు" అనే గేయాన్ని ఎవరు రచించారు?
----> దాశరథి కృష్ణమాచార్య.

202. పక్షులు ఎగిరేటప్పుడు దీని సాయంతో దిశను మార్చుకుంటాయి?
----> తోక సాయంతో

203. కొల్లలుగా అంటే అర్థం ఏమిటి?
----> ఎక్కువగా.

204. ఏగుచున్నవి అనగా అర్థం ఏమిటి?
----> పోతున్నది.

205." తుదకు" అంటే అర్థం ఏమిటి?
----> చివరకు.

206. వాక్యాల చివరగా ఉన్న చుక్క ను ( . ) ఏమంటారు?
----> వాక్యంత బిందువు (పుల్ స్టాప్)

207. వాక్యంలో స్వల్పంగా విరామం ఇచ్చే చోట వాడే చిహ్నము ఏది?
----> స్వల్ప విరామ చిహ్నం /కామా( , )

208. కంసుడు ఎవరు?
----> మహా క్రూరుడైన రాక్షసుడు.

209. కంసుని చెల్లెలు పేరు ఏమిటి?
----> దేవకి.

210. దేవకి యొక్క భర్త పేరేమిటి?
----> వసుదేవుడు.

211. దేవకీవసుదేవులకు ఎనిమిదవ సంతానంగా జన్మించిన ఎవరు?
----> శ్రీకృష్ణుడు

212. శ్రీ కృష్ణుడు ఎవరి దగ్గర పెరిగాడు?
----> నందగోపుడు యశోద వద్ద.

213. నందగోపుని యొక్క భార్యలు ఎవరు?
----> యశోద మరియు రోహిణి.

214. నందగోపుని భార్య రోహిణి ఎవరికి జన్మనిచ్చింది?
----> బలరాముని కి.

215. అందమైన గోపిక రూపంలో శ్రీకృష్ణుని చంపడానికి వచ్చిన రాక్షసి ఎవరు?.
----> పూతన

216. ఉయ్యాల పడుకున్న కృష్ణుని చంపడానికి కాకి రూపంలో వచ్చింది ఎవరు?
----> కాకాసురుడు.

217. అతిథి అనగా అర్థం ఏమిటి?
----> తిథి నియమాలు చూసుకోకుండా వచ్చేవాడు.

218. అమృతం అనగా అర్థం ఏమిటి?
----> దేవతల ఆహారం( మరణం లేకుండా చేసేది)

219. అవధులు అనగా అర్థం ఏమిటి?
----> హద్దులు.

220. కూడలి అనగా ఏమిటి?
----> నాలుగు తొడలు కలిసే చోటు.

221. రాములమ్మ కు ఎటువంటి బొమ్మలు అంటే ఇష్టం?
----> గుర్రపు బొమ్మలు.

222. ప్రశ్నార్థక చిహ్నం(?) వాక్యాల చివరన ఉంటే ఆ వాక్యాలను ఏమంటారు?
----> ప్రశ్నార్థక వాక్యాలను.

223. ( ? ) దీనిని ఏమంటారు?
----> ప్రశ్నార్థక చిహ్నం.

224. ఆశ్చర్యకరమైన వాక్యాల చివరలో ఉండే గుర్తు?
----> ( ! ) ఆశ్చర్యార్థక చిహ్నం

225. ఆశ్చర్యార్థక చిహ్నం చివర గల వాక్యాలను ఏమంటారు?
----> ఆశ్చర్యార్థక వాక్యాలు.

226. పోస్టు కార్డు మీద రాసి ముఖ్యమైన నంబర్?
----> పిన్ కోడ్( PIN)

227. PIN అనగా నేమి?
పోస్టల్ ఇండెక్స్ నెంబర్ ( postal index number)

228. పోస్టల్ ఇండెక్స్ నెంబర్( పిన్) లో ఎన్ని సంఖ్యలుంటాయి?
----> 6 ఆరు

229. పోస్టల్ ఇండెక్స్ నంబర్ లో మొదటి అంకె దేనిని తెలియజేస్తుంది?
----> రాష్ట్రాన్ని తెలియజేస్తుంది.

230. postal index నెంబర్లో రెండో మూడో అంకెలు దీన్ని తెలియజేస్తాయి?
----> జిల్లాను తెలియ జేస్తాయి.

231. పోస్టల్ ఇండెక్స్ నంబర్ లో చివరి మూడు అంకెలు దేనిని సూచిస్తాయి?
----> తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి.

232. ఉత్తరాలను చిరునామాలకు చేర్చేది ఎవరు?
----> పోస్ట్ మాన్.

233. ఉత్తరాలు కచ్చితంగా చేరాలంటే ఏం రాయాలి?
----> పిన్ కోడ్.

234. పూర్వకాలంలో ఉత్తరాలను వేటి ద్వారా పంపేవారు?
----> పావురాలు, దూతలు, రైతుల ద్వారా.

235. కంప్యూటర్ పరిజ్ఞానం పెరగడం వల్ల పంపాల్సిన సమాచారాన్ని వేటి ద్వారా పంపిస్తున్నారు?
----> ఎస్ఎంఎస్ (SMS) లు ఈమెయిల్ (E. mail) ల ద్వారా

236. పోస్టాఫీసులలో టెలిగ్రామ్ తో పాటు పనిచేసే మరొక వ్యవస్థ?
----> EMS

237. కంప్యూటర్ పరిజ్ఞానంతో రెప్పపాటు కాలంలో సమాచారాన్ని చేరవేయడానికి ఉపయోగపడేది?
----> SMS, E.mail

238. పోటీ పరీక్షల దరఖాస్తులను పంపడానికి ఉపయోగపడేది?
----> పోస్ట్ ఆఫీస్.

239. ప్రపంచంలోనే అతి పెద్దదైన తపాలా వ్యవస్థలో ఎన్ని పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి?
----> లక్షా యాభైవేల పైన

240. పోస్ట్ కవర్ల బరువును బట్టి అతికించవలసినవి?
----> స్టాంపులు.

241. పోస్టాఫీసులు అందించే సేవలు ఏవి?
----> సేవింగ్ అకౌంట్లు, రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, సంచయిక మరియు జీవిత బీమా పాలసీ.

242. మనియార్డరు అనగానేమి?
పోస్టాఫీసు ద్వారా డబ్బులు పంపడం.

243. ఏ దేశం యొక్క తపాలా వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్దది?
----> భారతదేశ తపాలా వ్యవస్థ.

244. అవని అనగా అర్థం ఏమిటి?
----> భూమి.
245. గణము అనగా అర్థం ఏమిటి?
----> గుంపు, సమూహము

246. పూనుకొనక అనగా అర్థం ఏమిటి?
----> ప్రయత్నించు, ఆరంభించు

247. సమయస్ఫూర్తి అనగా ఏమిటి?
----> సమయానికి తగినట్లుగా తెలివిని ఉపయోగించడం.

248. రౌతు అనగా ఎవరు?
----> గుఱ్ఱమును స్వారీ చేసేవాడు.

249. మావటివాడు అనగా ఎవరు?
----> ఏనుగులు నడిపించే వాడు.

250. తరువు అనగా అర్థం ఏమిటి?
----> చెట్టు, వృక్షము

251. హంగులు అనగా అర్థం ఏమిటి?
----> సౌకర్యాలు.

252. రాజిల్లు అనగా అర్థం ఏమిటి?
----> ప్రకాశించుట, వెలుగుట

253. విఘ్నము అనగా ఏమిటి?
----> అడ్డు, అవాంతరం.

254. సంప్రదాయం అనగా ఏమిటి?
----> తరతరాలుగా వచ్చే ఆచారము,

255. "సంహరించు" అనగా అర్థం ఏమిటి?
----> చంపుట.

256. పక్షము అనగానేమి?
----> పూర్ణిమ లేదా అమావాస్య తిథి వరకు వచ్చే పదిహేను తిథులను పక్షం అంటారు.

257. తిథులలో మొదటి తిథి ఏది?
----> పాడ్యమి

258. పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు ఉన్న 15 రోజులని ఏమంటారు?
----> శుక్లపక్షము.

259. పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండే 15 రోజులను ఏమంటారు?
----> కృష్ణపక్షము.

260. పూర్ణిమ అమావాస్య రెండు ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి?
----> 15 రోజులకు ఒకసారి.

261. సోన అనగా అర్థం ఏమిటి?
----> సన్న వాన.

262. శతకం అనగా ఏమిటి?
----> నూరు పద్యాలు గల రచన.

263. వన్నెచిన్నెలు అనగా అర్థం ఏమిటి?
----> అందాలు.

264. "ముల్లోకములు" ఈ పదంలో ఉన్న సంఖ్య ఎంత?
----> 3( మూడు)

265. "భూమి" అనే అర్థాన్నిచ్చే పదాలు ఏవి?
----> క్షేత్రము, పొలము

266. సంచయిక అనగా అర్థం ఏమిటి?
----> పొదుపు.

267. శుభకార్యం అనగా ఏమిటి?
----> మంచి పని.

268. ఏకదంతం అనే పదంలో ఉన్న సంఖ్య ఏది?
----> ఒకటి(1)

269. ద్విముఖాలు అనే పదంలో ఉన్న సంఖ్య ఏది?
----> రెండు ( 2 )

268. త్రిలింగాలు అనే పదం లో గల సంఖ్య ఏది?
----> మూడు (3)

269. చతుర్వేదాలు అనే పదం లో గల సంఖ్య?
----> నాలుగు( 4 )

270. పంచపాండవులు అనే పదం లో గల సంఖ్య ఏది?
----> ఐదు( 5 )

271. షట్చక్రవర్తులు అనే పదం లో గల సంఖ్య ఏది?
----> ఆరు( 6 )

272. సప్తర్షులు అనే పదం లో గల సంఖ్య ఏది?
----> ఏడు( 7 )

273. అష్ట దిక్కులు అనే పదం లో గల సంఖ్య ఏది?
----> ఎనిమిది( 8 )

274. నవగ్రహాలు అనే పదం లో గల సంఖ్య ఏది?
----> తొమ్మిది( 9 )

275. దశావతారాలు అనే పదం లో గల సంఖ్య ఏది?
----> పది (10 )

276. మతసామరస్యం అనగా ఏమిటి?
----> ఇతర మతాలను సమానంగా గౌరవించడం.

277. మూలాధారం అనే పదానికి అర్థం ఏమిటి?
----> ముఖ్యమైనది.

278. మహి అనగా అర్థం ఏమిటి?
----> భూమి

279. వేల్పు అనగా అర్థం ఏమిటి?
----> దేవుడు

280. తరుణం అనగా అర్థం ఏమిటి?
----> సమయం, అవకాశం

281. దూత అనగా ఎవరు?
----> రాయబారి, ప్రతినిధి

282. చిత్రకారుడు చిత్రం గీయడానికి వస్త్రం బిగించిన చిత్రాన్ని ఏమంటారు?
----> కేన్వాసు.

283. నందనుడు అనగా అర్థం ఏమిటి?
----> కొడుకు, కుమారుడు

284. నలుగు పిండి దేనికి ఉపయోగిస్తారు?
----> స్నానం చేయడానికి.

285. "నాదాలు" అనగా అర్థం ఏమిటి?
----> ధ్వనులు, శబ్దాలు

286. ప్రథమ గణాలు అనగా ఎవరు?
----> శివుని యొక్క భటుల సమూహాలు

287. ప్రశంస అనగా అర్థం ఏమిటి?
----> స్తుతి, పొగడుట, మెప్పు

288. పస అనగా అర్థం ఏమిటి?
----> సారము, సమృద్ధి

289. మనం పలికే ధ్వనుల గుర్తులను ఏమంటారు?
> అక్షరాలు

290. అక్షరాల అన్నింటినీ కలిపిన దాన్ని ఏమని పిలుస్తారు?
> వర్ణమాల.

291. వర్ణమాలలో అ నుండి హ వరకు గల అక్షరాలను ఏమంటారు?
----> అచ్చులు

292. వర్ణమాల లోని క నుండి ఱ వరకు గల అక్షరాలను ఏమంటారు?
----> హల్లులు.

293. భీముని యొక్క తల్లి పేరేమి?
----> కుంతీ దేవి.

294. భీముని యొక్క తండ్రి పేరు ఏమిటి?
----> పాండురాజు.

295. పాండురాజు కొడుకుల్లో భీముడు ఎన్నవ వాడు?
----> రెండవవాడు.

296. భీముని యొక్క అన్న పేరేమి?
----> ధర్మరాజు

297. భీముని యొక్క తమ్ముళ్ల పేరేమిటి?
---> అర్జునుడు, నకులుడు, సహదేవుడు?

298. పంచపాండవులు అనగా ఎవరు?
----> ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు

299. పాండు రాజు యొక్క అన్న పేరు ఏమిటి?
---> ధృతరాష్ట్రుడు.

300. హస్తినాపురానికి రాజు ఎవరు?
----> ధృతరాష్ట్రుడు.

301. ధృతరాష్ట్రునికి ఎంత మంది కొడుకులు కలరు?
----> వందమంది కొడుకులు.

302. జ్యోతి ధృతరాష్ట్రుని 100 మంది కొడుకులను ఏమంటారు?
---> కౌరవులు అంటారు.

303. కౌరవులలో పెద్దవాడు ఎవరు?
----> దుర్యోధనుడు.

304. యమునికి విషాహారం ఎవరి తినిపించారు?
----> దుర్యోధనుడు.

305. కౌరవుల మరియు పాండవులకు గురువు ఎవరు?
----> ద్రోణాచార్యుడు.

306. పాండవుల మరియు కౌరవుల లో ఎవరికి గదా యుద్ధం జరిగింది?
---> దుర్యోధనునికి భీమునికి

307. ఏకవచనం అనగానేమి?
----> ఒక వస్తువు పేరు తెలిపే పదాన్ని ఏకవచనం అంటారు.

308. బహువచనం అనగానేమి?
----> ఒకటి కంటే ఎక్కువ వస్తువులు ఉన్న పదాన్ని బహువచనం అంటారు.

309. అతిశయము అనే పదానికి అర్థం ఏమిటి?
----> గొప్పదనం మరియు అభివృద్ధి.

310. అధికులు అనగా అర్థం ఏమిటి?
----> గొప్పవారు.

311. అబ్బు అనగా అర్థం ఏమిటి?
---> లభించు మరియు కలుగు.

312. ఆత్మవిశ్వాసం అనగా ఏమిటి?
----> ధైర్యం,, తనమీద తనకు నమ్మకం

313. ఆబాలగోపాలం అనగా ఏమిటి?
----> చిన్న పిల్లల నుండి పెద్దల వరకు.

314. ఉగాది పండుగ ఎప్పుడు జరుపుకుంటారు?
----> చైత్ర మాసంలో మొదటి తిథి పాడ్యమి నాడు.

315. తెలుగు వారికి కొత్త సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది?
----> ఉగాది నుండి.

316. శ్రీరామనవమి పండుగను ఎప్పుడు జరుపుకుంటారు?
----> చైత్రమాస శుద్ధ నవమి రోజున జరుపుకుంటారు.

317. దసరా పండుగ ఏ రోజున జరుపుకుంటారు?
----> అశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజున

318. విజయదశమి అని ఈ పండుగను పిలుస్తారు?
----> దసరా పండుగను విజయదశమి అంటారు.

319. దసరా పండుగకు ఏమేమి జరుపుకుంటారు?
---> జమ్మి చెట్టుకు పూజ చేస్తాం, పాలపిట్టను చూస్తాం, బతుకమ్మ పండుగ జరుపుకుంటాం,

320. దసరా తర్వాత ఎన్ని రోజులకు దీపావళి వస్తుంది?
----> 20 రోజులకు.

321. దీపావళి పండుగ రోజున జరుపుకుంటాం?
----> అశ్వయుజ బహుళ అమావాస్య రోజు.

322. నరకాసుర వధ జరిగిన సందర్భంగా జరుపుకునే పండుగ, ఏది?
---> దీపావళి.

323. లక్ష్మి పూజలు ఏ పండుగ సందర్భంగా చేస్తారు?
----> దీపావళి పండుగ సందర్భంగా

324. మకర రాశిలోకి ప్రవేశించే రోజును ఏ పండుగగా జరుపుకుంటారు?
-----> సంక్రాంతి

325. శివలింగోద్భవం జరిగిన రోజును ఏ పండుగగా జరుపుకుంటారు?
----> శివరాత్రి.

326. ఇస్లాం క్యాలెండర్ లో మొదటి నెల పేరేమిటి?
----> రంజాన్.

327. ముస్లింల యొక్క పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్ ఏ నెలలో ఆవిర్భవించింది?
----> రంజాన్ నెలలో.

328. ముస్లింలు రంజాన్ నెల చివరన జరుపుకునే పండుగ ఏది?
---> రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్)

328. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షతో ముస్లింలు జరుపుకునే పండుగ ఇది?
---> రంజాన్( ఈద్ ఉల్ ఫితర్)

329. త్యాగానికి ప్రతీకగా ముస్లింలు జరుపుకునే పండుగలు ఏవి?
----> బక్రీద్ మరియు మొహర్రం.

330. క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఏ రోజున జరుపుకుంటారు?
----> డిసెంబర్ 25న.

331. ఏసుక్రీస్తు ఏ రోజున జన్మిస్తాడు?
---> క్రిస్మస్ రోజు డిసెంబర్ 25.

332. లంబాడీలు జరుపుకునే పండుగ ఏది?
----> తీజ్ పండుగ

333. తీజ్ పండుగ ఏ పండుగ ను పోలి ఉంటుంది?
----> బొడ్డెమ్మ( బతుకమ్మ) పండుగ

334. లంబాడి ప్రజలు జరుపుకునే తీజ్ పండుగ లో లంబాడి దేవత ఎవరు?
----> సీత్లా భవాని

335. ఏ రోజున తీజ్ పండుగ యొక్క నిమజ్జనం జరుగుతుంది?
----> తొమ్మిదవ రోజు.

336. బొడ్డెమ్మ (బతుకమ్మ) పండుగకు పుట్టమన్నుతో గద్దెను చేసి దానిలో ఏ చెట్టును పెడతారు?
----> వెంపలి చెట్టు.

336. గౌరమ్మను ఏ పండుగ సందర్భంగా పూలతో అలంకరించి ఆడుకుంటారు?
---> బతుకమ్మ పండుగ సందర్భంగా.

337. "సాధన వల్ల పనులు సులభంగా సాధిస్తాం" ఈ వాక్యంలోని మహా ప్రాణ అక్షరాలు ఏవి?
---->ధ... ధి

338. "పాఠంలోని కథ చదివాను" ఈ వాక్యంలో మహా ప్రాణ అక్షరాలు గుర్తించండి?
--->ఠ... థ..

339. లక్నవరం చెరువు ఎక్కడ ఉన్నది?
----> జయశంకర్ జిల్లాలోని ములుగు మండలం దగ్గరలో ఉంది.

340. లక్నవరం చెరువు ను ఎవరు తవ్వించారు?
----> కాకతీయుల.

341. లక్నవరం చెరువు హైదరాబాదుకు ఎన్ని కిలోమీటర్ల దూరంలో కలదు?
----> 212 కిలోమీటర్లు.

342. లక్నవరం చెరువు వరంగల్ పట్టణానికి ఎంత దూరంలో ఉంది?
----> వరంగల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది.

343. అడవి ప్రాంతంలో గుట్టల మధ్య ఉన్న అందమైన విహారయాత్ర స్థలం ఏది?
----> లక్నవరం చెరువు.

344. ద్వీపాల సౌందర్యం బోటింగ్ సౌకర్యం ఈ పర్యాటక ప్రాంతం లో ఉంటుంది?
లక్నవరం చెరువు.

345. తెలంగాణ కాశ్మీరం గా పేరు పొందిన జిల్లా ఏది?
----> ఆదిలాబాద్.

346. తెలంగాణ లోని అతి ఎత్తైన జలపాతం గా పేరుపొందిన జలపాతం ఏది?
---> కుంటాల జలపాతం.

347. కుంటాల జలపాతం ఏ జిల్లాలో ఉంది?
---> నిర్మల్ జిల్లాలో ఉంది.

348. కుంటాల జలపాతం ఏ నది పైన కలదు?
---> ఉత్తర సహ్యాద్రి పర్వతశ్రేణుల్లో కడెం నదిపై కలదు.

349. నిర్మల్ మరియు ఆదిలాబాదు గుండా వెళ్లే జాతీయ రహదారి ఏది?
---> 44వ జాతీయ రహదారి.

350. కుంటాల జలపాతం నేరడిగొండ మండల కేంద్రానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో కలదు?
----> 12 కిలోమీటర్ల దూరంలో కలదు.
351. కుంటాల జలపాతం యొక్క ఎత్తు ఎంత?
---> దాదాపు నూట నలభై ఐదు అడుగులు( 45 మీటర్ల) ఎత్తు

352. పురాతన శివలింగం ప్రతిష్టమై ఉన్న జలపాతం ఏది?
---> కుంటాల జలపాతం

353. ప్రతి శివరాత్రి గిరిజన ప్రజలు పూజలు నిర్వహించే ప్రాంతం ఏది?
--> కుంటాల జలపాతం వద్ద ప్రతిష్టమై ఉన్న శివలింగం.

354. కుంటాల జలపాతం ఉన్న ప్రాంతాలు ఏవి?
--> లోతైన నీటి గుండాలు ఒక్క, గుహ

355. ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి కట్టడం ఏది?
--> నాగార్జునసాగర్.

356. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎక్కడ ఉన్నది?
---> నల్లగొండ జిల్లాలో కృష్ణా నది మీద ఉంది.

357. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎవరు, ఎప్పుడు శంకుస్థాపన చేశారు?
---> 1955లో భారత తొలి ప్రధానమంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ.

358. పురావస్తు శాఖ వారికి తవ్వకాల్లో బౌద్ధ శిల్పాలు ఇక్కడ లభించాయి?
--> నాగార్జునకొండ.

359. ఏ శతాబ్దం కాలం నాటి బద్ధ శిల్పాలు నాగార్జునకొండలో దొరికాయి?
----> క్రీ. శ. 1 -- 3శతాబ్దం కాలం నాటివి

360. నాగార్జునకొండను ఇక్ష్వాక రాజులు ఏ పేరుతో పిలిచేవారు?
----> విజయపురి.

361. నాగార్జునసాగర్ నుండి పది కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈ ప్రదేశం వస్తుంది?
---->అనుపు

362. అనుపు అనే ప్రదేశం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
---> బౌద్ధ మతానికి చెందిన నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు.

363. భారతదేశంలో రెండవ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏది?
---> నాగార్జునసాగర్ ప్రాజెక్టు.

364. నాగార్జునసాగర్ ప్రాజెక్టు యొక్క ఉపయోగం ఏమి?
---> ఈ ప్రాజెక్టు సాగునీరు తోపాటు విద్యుత్తు ఉత్పత్తికి ఉపయోగపడుతుంది.

365. నాగార్జునసాగర్ ప్రాజెక్టు రోజు ఎన్ని మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది?
---> నాగార్జునసాగర్ ప్రాజెక్టు రోజు 810 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది.

366. "చెరువు", "కుంట", "సరస్సు", "నది" ఈ పదాలలో వేరు గా ఉన్న దానిని గుర్తించండి?
---> నది.

367. "మందారం", "గులాబి", "కలువ", "మల్లెలు" ఈ పదాలలో వేరుగా ఉన్నదానిని గుర్తించండి?
---> కలువ

368. "గోదావరి", "కృష్ణా", "లక్నవరం", "మంజీరా" ఈ పదాలలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి?
---> లక్నవరం

369. "నాగార్జునసాగర్", "శ్రీరాంసాగర్", "హైదరాబాద్", "జూరాల" దీనిలో వేరుగా ఉన్న పదం ఏది?
---> హైదరాబాద్.

370. "పలక", "గంప", "పడక"," అనప" ఈ పదాలలో అచ్చు తో మొదలయ్యే పదం ఏది?
--->అనప

371. "ఇటుక", "పలక", "ఆట", "ఏనుగు" ఈ పదాలలో హచ్చుతో మొదలయ్యే పదం ఏది
--> పలక

368. కంచుమ్రోగునట్లు ___________________ మ్రోగునా పూరించండి.
---->కనకంబు

369. పురుషులందు పుణ్య పురుషులు ఎలా తెలుస్తారు?
----> గుణాలను బట్టి తెలుస్తారు.

370. ప్రపంచంలో పనులన్నీ ఏం చేయడం ద్వారా సమకూరు తాయి?
---> సాధన ద్వారా (సాధనమున పనులు సమకూరు ధరలోన)

372. ఇనుము విరిగితే అతకవచ్చు కానీ ఏమి విరిగితే అతకడం కుదరదు?
--->మనసు ( మనసు విరిగెనేని మరియంట నేర్చునా)

373. ఇతరుల తప్పులు వెతికే వాళ్లకు ఏ విషయం తెలియదు?
--> వాళ్ల తప్పులు వాళ్లకు తెలియవు... (తప్పులెన్నువారు తమతప్పులెరుగరు)

374. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు దేనితో సమానము?
---> పుట్టలోని చెదలుతో సమానం

375. పిరికి వాడు పైకి ఎలా కనిపిస్తారు?
---> బింకం గా కనిపిస్తాడు( గర్వము, బడాయిగా కనిపిస్తాడు. )

376. ముచ్చు(=దొంగ) అనే పదానికి వ్యతిరేక పదం?
-->మంచివాడు.

377. దుర్జనులు అనగా నేమిటి?
---> చెడ్డవారు.

378. దుర్జనులు అనే పదానికి వ్యతిరేక అర్థం ఏమిటి?
---> సజ్జనులు( మంచివారు)

379. "మేలు" అనే పదానికి వ్యతిరేక అర్థం ఏమిటి?
---> కీడు

380. భారత దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఎప్పుడు అవతరించింది?
---> జూన్ 2, 2014

381. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరు?
--- కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)

382. తెలంగాణ రాష్ట్ర జంతువుగా ఎంపిక చేయబడింది ఏది?
---> జింక.

383. తెలంగాణ రాష్ట్ర పక్షి గా ఎంపిక చేయబడిన పక్షి?
---> పాలపిట్ట

384. తెలంగాణ రాష్ట్ర వృక్షం ఎంపిక చేయబడిన వృక్షం ఏది?
---> జమ్మి చెట్టు(శమీ వృక్షము)

385. తెలంగాణ రాష్ట్ర పుష్పం గా ఎంపిక చేయబడిన పుష్పం ఏది?
--->తంగేడు పువ్వు.

386. తెలంగాణ ప్రజలు ఊరు దాటి వెళ్ళడం ఒక ఆనవాయితీగా ఏ పండగలో కనిపిస్తుంది?
---> దసరా పండుగ.

387. దానికి చిహ్నంగా పాలపిట్టను రాష్ట్ర పక్షి గా ఎంపిక చేశారు?
----> స్వేచ్ఛకు చిహ్నంగా.

388. పాలపిట్ట చూడడం ఒక రివాజుగా కలిగిన పండుగ ఏది?
---> దసరా పండుగ.

389. భారతంలో పాండవులు తమ ఆయుధాలను ఏ చెట్టు మీద దాచారు?
---> జమ్మి చెట్టు మీద.

390. తెలంగాణా లోనే అతి పెద్ద పండుగ ఏది?
---> దసరా పండుగ.

391. తెలంగాణలో జమ్మి ఆకులను ఏమని పిలుస్తారు?
----> బంగారం అని పిలుస్తారు.

392. జమ్మి చెట్టు దేనికి ప్రతీకగా పిలుస్తారు?
---> విజయానికి.

393. తెలంగాణ రాష్ట్ర సిగలో అలంకరించబడే పుష్పం ఏది?
----> తంగేడు పువ్వు.

394. తంగేడు పూలకు ఎటువంటి గుణమున్నది?
---> ఔషధ గుణం ఉన్నది.

395. తంగేడు పూలు ఏ రంగులో ఉంటాయి.?
---> పసుపు రంగులో ఉంటాయి.

396. తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించబడిన పండుగ ఏది?
---> బతుకమ్మ పండుగ.

397. మన జాతీయ జెండా ఏది?
---> మూడు రంగుల జెండా.

398. మన జాతీయ పక్షి ఏది?
---> నెమలి.

399. మన జాతీయ జంతువు గా గుర్తించబడిన జంతువు?
--> పులి.

400. మన జాతీయ వృక్షం గా గుర్తించబడిన వృక్షం ఏది?
----> మర్రిచెట్టు.

401. మన జాతీయ పుష్పంగా గుర్తించబడిన పుష్పం ఏది?
---> తామర.

402. మన జాతీయ ఫలం గా గుర్తించ బడిన ఫలమేది?
---> మామిడి పండు.

403. మన జాతీయ పతాకం లో గల మూడు రంగులు దేనికి ప్రతీక?
---> దేశ సమగ్రతకు, సమైక్యతకు ప్రతీక

404. మన జాతీయ పతాకం లోని కాషాయ రంగు దేనికి ప్రతీక?
---> కాషాయరంగు త్యాగానికి, దేశభక్తికి ప్రతీక

405. జాతీయ పతాకం లోని తెలుపు రంగు దేనికి ప్రతీక?
----> తెలుపు రంగు శాంతికి, సత్యానికి ప్రతీక

406. జాతీయ పతాకం లోని ఆకుపచ్చ రంగు దేనికి సంకేతము?
---> ఆకుపచ్చ రంగు నమ్మకానికి, సమృద్దికి, భూమికి సంకేతము

407. మన జాతీయ జెండా మధ్యలో అశోక చక్రం ఏ రంగులో ఉంటుంది?
---> అశోక చక్రం నీలి రంగులో ఉంటుంది.

408. నీలి రంగులో ఉన్న అశోక చక్రం లో ఎన్ని ఆకులు ఉన్నాయి?
---> 24 ఆకులు ఉన్నాయి.

409. అశోక చక్రం లోని 24 ఆకులు దేనికి సంకేతము?
---> ఇరవై నాలుగు గంటలకు, క్రమశిక్షణ, ధర్మానికి సంకేతము.

410. జెండా మధ్యలో గల అశోక చక్రం దేనికి సూచిక?
----> సూర్య బింబానికి సూచిక.

411. సంశ్లేష అక్షరాలు అనగా ఏమిటి?
---> ఒక హల్లుకు రెండు ఒత్తులు చేరితే వాటిని సంశ్లేష అక్షరాలు అంటారు

412. "శాస్త్రం" అనే పదంలో సంశ్లేష అక్షరం ఏది?
---> స్త్రం

413. "జ్యోత్స్న" అనే పదంలో సంశ్లేష అక్షరం ఏది?
---> త్స్న

414. భారతదేశానికి స్వాతంత్రం తేవడం కోసం అహింసా మార్గంలో పోరాడిన మహనీయుడు ఎవరు?
---> మహాత్మా గాంధీజీ.

415. మహాత్మా గాంధీజీ పూర్తి పేరు ఏమిటి?
---> మోహన్ దాస్ కరం చంద్ గాంధీ.

416. గాంధీజీ ఎప్పుడు ఎక్కడ జన్మించారు?
---> 1869 అక్టోబరు 2 వ తేదీన గుజరాత్ లోని పోరుబందర్లో జన్మించారు.

417. గాంధీజీ యొక్క తల్లిదండ్రుల పేరు ఏమిటి?.
----> తండ్రి పేరు కరంచంద్ గాంధీ, తల్లి పేరు పుత్లీబాయి.

418. మహాత్మా గాంధీని ప్రభావితం చేసిన నాటకం పేరేమిటి?
---> సత్య హరిచంద్ర నాటకం.

419. మహాత్మా గాంధీజీ కి తన తండ్రి ఈ పుస్తకం కొని ఇచ్చాడు?
---> శ్రవణ కుమారుని నాటకం.

420. గాంధీజీ యొక్క భార్య పేరేమిటి?
---> కస్తూరిబాయి.

421. మహాత్ముడిగా పేరు పొందినది ఎవరు?
---> గాంధీజీ.
Comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.
Comment Poster
Good , but it would better if you post the same in pdf
Replied
It is in PDF too... Check the link... its better EVS, Maths will be in english

-Advertisement-