-Advertisement-

TG GURUKUL CET MATHEMATICS FOR CLASS V

TG GURUKUL CET MATHEMATICS CLASS V
SCHOOLS VISION

TG GURUKUL CET STUDTMATERIAL 
prepared in heuristic method for real time assessment..

TG GURUKUL CET 5th CLASS

MATHEMATICS

1. ఇటుక మరియు ఇటుక ఆకారంలో ఉన్న వస్తువులకు ఎన్ని అంచులు ఎన్ని మూలలు ఉంటాయి?
> అంచులు 12 ,, మూలలు 8

2. పాచిక, పాచిక ఆకారం గల వస్తువులకు ఎన్ని అంచులు ఎన్ని మూలలు ఉంటాయి?
> అంచులు 12 ,, మూలలు 8

3. జోకర్ టోపీ ఆకారం గల వస్తువులకు ఎన్ని అంచులు ఎన్ని మూలలు ఉంటాయి?
>అంచులు 1, మూలలు 1

4. పీపా ఆకారంలోగల వస్తువులకు ఎన్ని అంచులు ఎన్నిమూలలు ఉంటాయి
>అంచులు 2, మూలలు ఉండవు

5. బంతి ఆకారంలో గల వస్తువులు అంచులు మూలాలు కలిగి ఉంటాయి?
> బంతి ఆకారంలో గల వస్తువులకు అంచులు మూల లు ఉండవు.

6. సబ్బు పెట్టెకు ఎన్ని ముఖాలు ఉంటాయి?
> 6 (ఆరు)

7. పాచికకు ఎన్ని ముఖాలు ఉంటాయి?
> ఆరు ముఖాలు ఉంటాయి.

8. దీర్ఘ చతురస్రం ఎన్ని భుజాలను కలిగి ఉంటుంది?
> 4 (నాలుగు భుజాలను కలిగి ఉంటుంది)

9. దీర్ఘ చతురస్రం ఎన్ని మూలలను కలిగి ఉంటుంది?
> 4 (నాలుగు మూలలను కలిగి ఉంటుంది.)

10. దీర్ఘ చతురస్రం లో అన్ని భుజాలు సమానంగా ఉంటాయా ? .
> ఉండవు. (ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి)
11. చతురస్రం ఎన్ని భుజాలను కలిగి ఉంటుంది?
> 4.( నాలుగు భుజాలను కలిగి ఉంటుంది)

12. చతురస్రం ఎన్ని మూలలను కలిగి ఉంటుంది?
> 4. (నాలుగు మూలలను కలిగి ఉంటుంది)

13. చతురస్రం యొక్క అన్ని భుజాలు సమానంగా ఉంటాయా?
> చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి.

14. త్రిభుజం ఎన్ని భుజాలను కలిగి ఉంటుంది?
> మూడు భుజాలను కలిగి ఉంటుంది.

15. త్రిభుజం ఎన్ని మూలలను కలిగి ఉంటుంది?
> మూడు మూలలను కలిగి ఉంటుంది.

16. వృత్తం ఎన్ని భుజాలను మూలలను కలిగి ఉంటుంది?
> వృత్తానికి భుజాలు మూలలు ఉండవు.

17. 972 అనే సంఖ్య పేరు ఏమిటి?
> తొమ్మిది వందల డెబ్బైరెండు.

18. 399 అనే సంఖ్యను విస్తరించి వ్రాయండి?
>300+90+9 (లేదా) 3వందలు+9పదులు+9ఒకట్లు (లేదా) 3x100+9x10+9x1

19. 5 7 1 లో 5 యొక్క స్థాన విలువ ఎంత?
> 500

20. నేను ఒక రెండు అంకెల సంఖ్యను నా ఒకట్ల స్థానంలో 6 పదుల స్థానంలో 1 ఉన్నాయి అయినా నేనెవరిని?
> 16.

21. నేను 30 మరియు 40 మధ్యలో ఉంటాను ఒకట్ల మరియు పదుల స్థానంలో ఓకే అంటే ఉంటుంది అయినా నేనెవరిని?
> 33.

22. గౌరీ వద్ద ఒక వెయ్యి రూపాయల నోటు 2 పది రూపాయల నోట్లు ఉన్నాయి. గౌరి వద్దగల రూపాయలు ఎన్ని?
>1020 రూపాయలు.

23. 400+30+4 విస్తరణ రూపానికి సరైన సంఖ్య ఏది?
> 434

24. 100 లో ఎన్ని పదులుంటాయి?
> 10

25. రెండంకెల సంఖ్యలలో అతి చిన్న సంఖ్య ఏది?
> 10.

26. రెండంకెల సంఖ్యలో అతిపెద్ద సంఖ్య ఏది ఏది?
> 99

27. మూడు అంకెల తో ఏర్పడే మొదటి సంఖ్య ఏది?
> 100.

28. మూడంకెల సంఖ్యలు అతి చిన్న సంఖ్య ఏది?
> 100.

29. మూడంకెల సంఖ్యలు అతిపెద్ద సంఖ్య ఏది?
>999

30. 100 లో ఎన్ని ఒకట్లు ఉంటాయి?
> 100

31. 149 మరియు 151 కి మధ్య ఉన్న సంఖ్య ఏది?
> 150

32. 691లో 6 యొక్క స్థాన విలువ ఎంత?
> 600

33. ఒకట్ల స్థానంలో 5, పదుల స్థానంలో 2, వందల స్థానంలో 7 ఉన్న సంఖ్య ఏది?
> 725

34. 1 2 6 ను విస్తరణ రూపంలో రాయండి?
> 100+20+6

35. > , < , = గుర్తులు దేనిని సూచిస్తాయి?
----- > పెద్దది..... < చిన్నది..... = సమానము

36. 86____68 ఖాళీ లో ఏ గుర్తు సరైనది?
---- ' > '

37. 27____72 ఖాళీ లో ఏ గుర్తు సరైనది?
---- ' < '

38. 68___68 ఖాళీ లో ఏ గుర్తు సరైనది?
---- ' = '

39. 57, 67, 97 లో అతి పెద్ద సంఖ్య ఏది?
> 97

40. 45, 65, 76, 32, 98 లో అతి చిన్న సంఖ్య ఏది?
> 32

41. ఆరోహణ క్రమం అనగా నేమి?.
> చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వరకు వరుసగా సంఖ్యలను అమర్చడాన్ని ఆరోహణ క్రమం అంటారు.

42. అవరోహణ క్రమం అనగానేమి?
> పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వరకు వరుసగా సంఖ్యలను అమర్చడాన్ని అవరోహణ క్రమం అంటారు.

43) 64 , 35 , 79, 84 లను ఆరోహణ క్రమంలో వ్రాయండి?
> 35 , 64 , 79 , 84

44) 48, 57, 95 , 34 లను అవరోహణ క్రమంలో వ్రాయండి?
> 95 , 57 , 48 , 34

45) 9, 3, 2 లతో ఏర్పడే అతిపెద్ద సంఖ్య మరియు అతి చిన్న సంఖ్యలో రాయండి?
> అతిపెద్ద సంఖ్య 932, అతి చిన్న సంఖ్య 239.

46. ఒక తోటలో 135 మామిడి చెట్లు, 145 జామ చెట్ల ఉన్నాయి. తోటలోని మొత్తం చెట్లు ఎన్ని?
జవాబు : 135+ 145 = 280 మొత్తం చెట్లు 280.

47. రాణి వద్ద రూ. 342 లు ఉన్నవి, అఖిల వద్ద రాణి కన్నా రూ. 125 లు తక్కువగా ఉన్నాయి. అఖిల వద్దగల డబ్బు ఎంత?
జవాబు : 342 - 125 = 217

48. 100 , 200 , 300 , 400 _. తరువాత వచ్చే సంఖ్య ఏది?
జవాబు : 500

49. 900, 800 , 700 __ తరువాత వచ్చే సంఖ్య ఏది?
జవాబు : 600

50. 25, 50, 75, ___ తర్వాత వచ్చే సంఖ్య ఏది?
జవాబు: 100
51. ఆవర్తన సంకలనం అనగా మళ్లీ మళ్లీ కూడా అని దేనిని అంటారు?
>. గుణకారం

52. 5 + 5 + 5 ను గుణకార రూపంలో రాయండి?
జవాబు: 3 x 5 =15.

53. 6 x 6 x 6x 6 ను గుణకార రూపంలో రాయండి?
జవాబు: 4 x 6 =24

54. 1+1+1+1+1+1+1 ను గుణాకర రూపంలో రాయండి?
జవాబు: 7 x 1 =7

55.ఒక కిలో ఉల్లిగడ్డ ధర 10 రూపాయిలు అయిన 5 కిలోల ఉల్లిగడ్డలు కొనడానికి అయ్యే ఖర్చు ఎంత?
జవాబు: 10రూ x 5 = 50 రూపాయలు

56. ఏదైనా ఒక సంఖ్యను సున్నాతో ( 0) గుణిస్తే వచ్చే ఫలితం ఎంత
జవాబు: సున్నా( 0)

57. ఏదైనా ఒక సంఖ్యను 1తో గుణిస్తే వచ్చే ఫలితం ఎంత?
జవాబు: అదే సంఖ్య వస్తుంది.

58. రోజా ప్రతిరోజూ 5 రూపాయలు ఖర్చు చేయును. ఈ విధంగా ఒక వారంలో తను ఖర్చు చేసినది ఎంత?
జవాబు: వారానికి 7 రోజులు... 7 x 5 = 35 రూపాయలు.

59. సూర్య వయస్సు రమ్య వయస్సుకు రెండు రెట్లు రమ్య వయస్సు 9 సంవత్సరాలు అయితే సూర్య వయస్సు ఎంత?
జవాబు: 2 x రమ్య వయస్సు = 2 x 9 = 18 సంవత్సరాలు.

60. భాగహారం అనగా ఏమిటి?
జవాబు: సమాన భాగాలుగా పంచడం.

61. నాలుగవ తరగతిలో 50 మంది విద్యార్థులు ఉన్నారు వీరిని ఐదుగురు చొప్పున గ్రూపులు చేస్తే ఎన్ని గ్రూపులు ఏర్పడతాయి?
జవాబు: 50 ÷ 5 = 10, 10 గ్రూపులు ఏర్పడతాయి.

62. పొడవును కొలవడానికి ఉపయోగించే ప్రామాణిక సాధనాలు ఏవి?
జవాబు: స్కేలు, టేపు

63. పొడవును సెంటీమీటర్లు మరియు అంగుళాల(inches) లో కొలుచుటకు ఉపయోగించేది ఏది?
జవాబు: స్కేల్.

64. సెం. మీ అనగా నేమి?
జవాబు: సెంటీమీటరు.

65.దుకాణదారు వస్తువుల బరువును చూడడానికి ఉపయోగించేవి?
జవాబు: తూనిక రాళ్ళు.

66. పాత్ర యొక్క సామర్థ్యం అనగానేమి?
జవాబు: ఒక పాత్రలో పట్టే ద్రవం యొక్క గరిష్ట పరిమాణాన్ని ఆ పాత్ర యొక్క సామర్థ్యం అంటారు.

67. ద్రవాలను కొలవడానికి ఉపయోగించే కచ్చితమైన ప్రమాణం ఏది?
జవాబు: లీటరు.

68. గడియారంలో చిన్న ముల్లు ను ఏమంటారు?
జవాబు: గంటల ముళ్ళు.

69. గడియారంలో పెద్ద ముల్లు ను ఏమంటారు?
జవాబు: నిమిషాల ముల్లు.

70. 8 గంటలకు, 3 గంటలకు ,5 గంటలకు నిమిషాల ముల్లు ఎక్కడ ఉంటుంది?
జవాబు: 12 పైన ఉంటుంది.

71. ఒక వారానికి ఎన్ని రోజులు?
జవాబు : 7 రోజులు

72. వారంలో మొదటి రోజు ఏది?
జవాబు : ఆదివారం

73. వారంలో చివరి రోజు ఏది?
జవాబు: శనివారము

74. ఒక సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయి?
జవాబు : 12 నెలలు ఉంటాయి

75. సంవత్సరములో మొదటి నెల ఏది?
జవాబు : జనవరి

76. సంవత్సరంలో చివరి నెల ఏది?
జవాబు: డిసెంబర్

77. స్వాతంత్ర దినోత్సవాన్ని ఏ నెలలో జరుపుకుంటారు?
జవాబు : ఆగస్టు నెలలో జరుపుకుంటాం

78. గణతంత్ర దినోత్సవాన్ని ఏ నెలలో జరుపుకుంటాం?
జవాబు: జనవరి నెలలో జరుపుకుంటాం

79. 31 రోజులు ఉన్న నెలల పేర్లు రాయండి?
జవాబు : జనవరి, మార్చి, మే, జులై, ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్

80. 30 రోజులు ఉన్న నెలల పేర్లు రాయండి?
జవాబు: ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్.

81. ఒక హాస్టల్ లో రోజూ 24 లీటర్ల పాలను వినియోగిస్తారు అయితే వారానికి ఎన్ని లీటర్ల పాలను వినియోగిస్తారు?
జవాబు: 24 x 7 = 168 లీటర్లు.

82. ఒక తోటలో మామిడి చెట్లు 12 వరుసలో ఉన్నాయి ఒక్కో వరుసలో 10 చెట్లు ఉంటే మొత్తం ఎన్ని మామిడి చెట్లు ఉన్నాయి?
జవాబు: 12 x 10 =120, మామిడి చెట్లు 120

83. ఒక బియ్యం బస్తా ధర ₹325 అయిన 3 బస్తాలు ధర ఎంత?
జవాబు: 325 x 3 = ₹ 975

84. 95 రూపాయలలో ఎన్ని 5 రూపాయలు ఉన్నాయి?
జవాబు: 95 ÷ 5 = 19

85. రెండు సంఖ్యల లబ్దం 77 వాటిలో ఒక సంఖ్య 7 అయిన రెండవ సంఖ్య ఎంత?
జవాబు: 77 ÷ 7 = 11, కావున రెండవ సంఖ్య 11.

86. దసరా పండుగ రావడానికి 28 రోజులు ఉన్నాయి అయితే ఎన్ని వారాల తర్వాత దసరా వస్తుంది?
జవాబు: వారానికి 7 రోజులు కావున, 28÷7= 4, నాలుగు వారాల తర్వాత వస్తుంది.

87. నేను 30 మరియు 40 మధ్యలో ఉంటాను 5 తో భాగించగా శేషం 3 వచ్చింది, అయినా నేనెవరిని?
జవాబు: 33÷ 5 = 6 భాగఫలం + 3 శేషం(&) 38÷ 5 = 7 భాగఫలం + 3 శేషం. కావున జవాబు 33 మరియు 38.

88. నేను 50 కి 60 కి మధ్య ఉంటాను 7తో భాగించగా శేషం 1 వచ్చింది అయినా నేనెవరిని?
జవాబు: 50 ÷ 7 = 7 భాగఫలం + శేషం 1, కావున జవాబు 50. అలాగే 57.

89. ఒక సంవత్సరంలో ఎన్ని వారాలు ఉంటాయి?.
జవాబు: 52

90. రెండు సంఖ్యల లబ్దం 72 వాటిలో ఒకటి 12 అయిన రెండవ సంఖ్య?
జవాబు: 72 ÷ 12 = 6, కావున రెండవ సంఖ్య 6.

91. పొడవులు కొలవడానికి ఉపయోగించే c.m అనగా ఏమిటి?
జవాబు : సెంటీమీటరు

92. 1 మీటర్ అనగా ఎన్ని సెంటిమీటర్లు?
జవాబు: 100 సెంటీమీటర్లు

93. 2012 ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి?
జవాబు: లండన్ లో జరిగాయి

94. హైదరాబాదులో గల చార్మినార్ యొక్క ఎత్తు ఎంత?
జవాబు : 56 మీటర్లు

95. 9 మీటర్లు ఎన్ని సెంటీమీటర్ల తో సమానం?
జవాబు:900 సెంటీమీటరు.

96. 1 కిలోగ్రామ్ కి ఎన్ని గ్రాములు?
జవాబు : 1000 గ్రాములు

97. 1 లీటరు కి ఎన్ని మిల్లీ లీటర్లు?
జవాబు :.1000 మిల్లీలీటర్లు

98. ఒక లీటర్ బాటిల్ తో రెండు చిన్న బాటిల్స్ లో నింపి నట్లయితే ఒక్కొక్క చిన్న బాటిళ్లలో ఎంత పడుతుంది?
జవాబు :500 మిల్లీ లీటర్లు

99. నాలుగు చిన్న బాటిల్ లతో ఒక లీటర్ బాటిల్ ను నింపినట్లయితే ఒక్కొక్క చిన్న బాటిల్ లో ఎంత పడుతుంది?
జవాబు :250 మిల్లీ లీటర్లు

100. 3 లీటర్లు ఎన్ని మిల్లీలీటర్ల తో సమానం?
జవాబు: మూడువేల మిల్లీ లీటర్లు
101. 8500 మిల్లీలీటర్లు దేనితో సమానము?
జవాబు: 8 లీటర్లు మరియు 500 మిల్లీ లీటర్లు

102. గడియారంలో పెద్ద ముల్లు నిమిషాలను సూచిస్తుంది ఒకవేళ పెద్ద ముళ్ళు 1 మీద ఉన్నట్లయితే ఎన్ని నిమిషాలు గడిచినట్లు?
జవాబు : గడియారంలోని 12 నుండి సంఖ్యల మధ్య దూరం 5 నిమిషాలు కావున.... 1 x 5= 5, 5నిమిషాలు

103. గడియారంలో పెద్ద ముల్లు నిమిషాలను సూచిస్తుంది ఒకవేళ పెద్ద ముళ్ళు 7 మీద ఉన్నట్లయితే ఎన్ని నిమిషాలు గడిచినట్లు?
జవాబు : గడియారంలోని 12 నుండిసంఖ్యల మధ్య దూరం 5 నిమిషాలు కావున.... 7 x 5= 35, 35నిమిషాలు

104. లీపు సంవత్సరం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది?
జవాబు : 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది.

105. లీపు సంవత్సరంలో మొత్తం ఎన్ని రోజులు ఉంటాయి?
జవాబు : 366 రోజులు

106. లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు ఉంటాయి?
జవాబు :29 రోజులు ఉంటాయి

107. సాధారణ సంవత్సరాలలో ఫిబ్రవరి నెలలో ఎన్నిరోజులు ఉంటాయి?
జవాబు: 28 రోజులు ఉంటాయి

108. 31 డిసెంబర్ సోమవారం ఐతే 1 జనవరి తరువాతి సంవత్సరం ఏ రోజు అవుతుంది?
జవాబు : మంగళవారం

109. 12 పెన్సిల్లను ముగ్గురికి సమానంగా పంచగా ఒక్కొక్కరికి 4 పెన్సిల్ చొప్పున వస్తాయి దీన్ని ఎలా రాస్తారు
జవాబు: 12÷3= 4 అదే విధంగా 12/3 =4

110. లత 6 వడలను చేసి వాటిని ముగ్గురు పిల్లలకు సమానంగా పంచింది దీన్ని ఎలా రాస్తారు?
జవాబు: 6÷3 = 2

111. 4/2 అనగా ఏమిటి?
జవాబు: 4 వస్తువులను ఇద్దరికీ సమానంగా పంచడం

112. సగం అనగా నేమిటి?
జవాబు: రెండు సమాన భాగాలలో ఒక భాగము.

113. సగం ను ఎలా చూపిస్తారు?
జవాబు: 1÷2. లేదా 1/2

114. పావు భాగమును ఎలా చూపిస్తారు?
జవాబు: 1/4

115. మూడు రొట్టెలను ఇద్దరికీ సమానంగా పంచడం ని ఎలా చూపిస్తారు?.
జవాబు: 3/2

116. నాలుగు సమాన భాగాలను ఉండి ఒక్క సమాన భాగం తీసుకున్న భిన్నరూపము?
జవాబు: 1/4

117.. ఒక డజను ఎన్ని వస్తువులకు సమానం?
జవాబు: 12

118. 2, 4, 6, 8 ఈ అమరిక తర్వాత వచ్చే మూడు సంఖ్యలు రాయండి?
జవాబు : 10, 12, 14
Comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.

-Advertisement-