Explain:న్యూజిలాండ్ తొలిసారిగా మహిళలకు ఓటుహక్కును కల్పించింది. ఓటు హక్కు వయస్సును 16 సంవత్సరాలకు తగ్గించాలని ఆలోచిస్తుంది.
Q2. సౌరకుటుంబంలో మొత్తం గ్రహాలు ఎన్ని?
Answer: 8
Explain:2006 లో చెక్ రిపబ్లిక్ లో జరిగిన సమావేశంలో ప్లూటోకు గ్రహస్థాయి లేదని ప్రకటించి దీనిని మరుగుజ్జు గ్రహాల జాబితాలో చేర్చింది. ప్లూటోను శాస్త్రీయంగా 134 340 గా పిలుస్తారు.
Q3. భూమి తనచుట్టూ తానూ ఎంత వేగంతో తిరుగుతుంది?(గంటకు)
Answer: 1610
Explain: భూమి తనచుట్టూ తానూ గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. భూమి ఒక భ్రమణం చేయడానికి 23 గం. 56 ని. 4.092 సెకండ్లు పడుతుంది.
Q4. లేటరైట్ నేలల్లో ముఖ్యంగా లభించే ఖనిజం ఏది?
Answer: బాక్సైట్
Explain:లేటరైట్ నేలల్లో ముఖ్యంగా లభించే ఖనిజం బాక్సైట్. అధిక ఉష్ణోగ్రత మరియు అధిక వర్షపాతం ఒకదాని తర్వాత ఒకటి సంభవించే ప్రాంతాల్లో ఈ నేలలు ఏర్పడుతాయి. లేటరైట్ అనేది లాటిన్ పదం. దీనికి లాటిన్ భాషలో "బ్రిక్" అని అర్థం.అందువల్ల వీటిని "Brick soil" అంటారు. ఈ నేలలు ఆమ్ల లక్షణాలను కలిగి ఉంటాయి.
Q5. నోటిపూత (గ్లాసైటిస్) ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది?
Answer: విటమిన్ B2.
Explain: విటమిన్ B2 ను రసాయనికంగా రైబోప్లావిన్ అని పిలుస్తారు. దీని "Yellow Vitamin" అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువగా ఆవుపాలు,గుడ్లు, ఆకుకూరలు, కాలేయం మరియు మొలకెత్తిన గింజలలో ఉంటుంది. రైబోప్లావిన్ లోపించడం వల్ల గ్లాసైటిస్ అనే వ్యాధి కలుగుతుంది. ఆవుపాలు లేత పసుపు రంగులో ఉండడానికి కారణం రైబోప్లావిన్.
No comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.
No comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.